Vastu Tips for Home: శ్రావణ మాసంలో ఇంట్లో ఈ ఒక్క మొక్క నాటితే చాలు.. అన్ని దోషాలు తొలగిపోతాయి..
Vastu Tips for Home: శ్రావణ మాసపు పూజల్లో మారేడు దళాలను ఎక్కువగా వాడుతారు. మారేడు దళం శివుడికి ప్రీతికరమైనది. హిందూ శాస్త్రాలు, జ్యోతిష్యం, వాస్తు ప్రకారం మారేడు చెట్టు చాలా పవిత్రమైనది.
Vastu Tips for Home: శ్రావణ మాసం జూలై 23 నుంచి ఆగస్టు 22 వరకు ఉండనుంది. హిందువులకు ఇది పవిత్ర మాసం. ఈ మాసంలో పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బిల్వ (మారేడు) పత్రాలు, పంచామృతం వంటివి శివుడికి సమర్పిస్తారు. శివుడికి మారేడు చెట్టు, పండు ప్రీతిపాత్రమైనవి. మారేడు దళం లేకుండా శివ పూజ అసంపూర్ణమని చెబుతారు.
అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి
వాస్తు శాస్త్రంలో మారేడు మొక్క చాలా పవిత్రమైనదిగా, శుభప్రదమైనదిగా పేర్కొనబడింది. ఈ ఒక్క మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. శివ పురాణం ప్రకారం మారేడు మొక్క నాటిని ప్రదేశం కాశీ తీర్థం వలె పవిత్రమైనది, పూజ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు కలుగుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో ఈ మొక్క ఇంట్లో నాటితే అన్నివిధాలా శుభకరం.
దారిద్య్రాన్ని దూరం చేసి సంపదనిస్తుంది.
మారేడు మొక్క ఉన్న ఇంటిపై ఆ పరమ శివుడి అనుగ్రహం అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో తులతూగుతుంది.
మారేడు మొక్క ఇంట్లో ఉంటే.. ఆ ఇంట్లో లక్ష్మి కొలువై ఉంటుంది.ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు, ధాన్యానికి లోటు ఉండదు.
ఇంట్లోకి ధన ప్రవాహాన్ని పెంచడానికి.. డబ్బును భద్రపరిచిన ప్రదేశంలో మారేడు దళాలను ఉంచండి.
ఇంట్లో మారేడు మొక్కను నాటడం ద్వారా ఆ వ్యక్తి ఇదివరకు చేసిన పాపాలు తొలగిపోతాయి. అతనికి పుణ్యం లభిస్తుంది. అతని జీవితం సంతోషంగా ఉంటుంది.
మారేడు మొక్క ఇంట్లో ఉండటమంటే దేవతలను ఇంటికి ఆహ్వానించడమే. ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత నెలకొంటుంది. సిరిసంపదలు కలుగుతాయి.
మారేడు మొక్క ఇంట్లో ఉంటే ఎటువంటి చేతబడి ప్రభావం ఇంటిపై ఉండదు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు,మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో పండగే.. ఒకేసారి మూడు కానుకలు..
Also Read: Target Modi: ఆ మూడు రోజులు హైదరాబాద్ గులాబీ మయం! ప్రధాని మోడీకి కేసీఆర్ మార్క్ స్వాగతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.