Vastu tips for home: మన వంటింట్లో ఉప్పు, పసుపు రెండు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఉప్పు లేకపోతే కూరకు రుచి ఉండదు, పసుపు లేకపోతే ఆహార  పదార్ధాలకు రంగు ఉండదు. అంతేకాదు పసుపుతో అయితే ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు ఏ ఇంట్లో అయితే నిండుగా ఉంటాయో.. అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వీటి  గురించి వాస్తు శాస్త్రంలో (Vastu shastra)  కొన్ని సీక్రెట్స్ చెప్పబడ్డాయి. ఉప్పు, పసుపును ఎప్పుడూ దానం చేయకూడదట. మీకు ఎంత సన్నిహితులైనా సరే వీటిని దానం ఇవ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీని వల్ల ఇంట్లో డబ్బు నష్టం వాటిల్లుతుంది. మీరు ఆర్థిక సంక్షోభంలో  కూరుకుపోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యాస్తమయం తర్వాత మీరు ఇరుగుపొరుగు వారికి ఉప్పును అప్పుగా ఇస్తే..  ఆర్థికంగా చాలా నష్టపోతారు. వంటగదిలో ఉప్పు అయినపోయినా సరే మీరు ఇబ్బందులు పడతారు. కాబ్టట్టి కిచెన్ లో ఎల్లప్పుడూ ఉప్పు (Salt) ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఉప్పు ఇవ్వాలనుకుంటే కొంత డబ్బు తీసుకుని ఇవ్వండి. హిందువులు పసుపును (Turmeric) చాలా పవిత్రంగా భావిస్తారు. వీరు ప్రతి శుభకార్యంలోనూ పసుపును వాడుతారు. పసుపను అప్పుగా ఇవ్వడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, వివాహానికి ఆటంకాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. 


వాస్తుశాస్త్రంలో కేతు గ్రహంతో ఉల్లిపాయ-వెల్లుల్లికి సంబంధం ఉంది. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఉల్లిపాయలు మరియు వెల్లుల్లికి సంబంధించిన వ్యాపారం చేయవద్దని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంటిలోని ఐశ్వర్యం పోతుందట. పాలు కూడా సాయంత్రం పూట ఎవరికీ దానం లేదా అప్పు ఇవ్వకూడదట.


Also Read: Naga Panchami 2022: ఆగస్టు 2న నాగపంచమి.. నాగదేవతను ఇలా పూజించండి!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook