Naga Panchami 2022 Puja Vidhanam: హిందువులకు ముఖ్యమైన పండుగలలో నాగపంచమి కూడా ఒకటి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి ఎక్కువగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలోని శుక్లపక్షం ఐదోరోజున నాగపంచమి వస్తుంది. ఈ రోజున నాగదేవతను పూజిస్తారు. ఈ ఏడాది నాగపంచమి (Naga Panchami 2022) ఆగస్టు 2, 2022 అంటే మంగళవారం వస్తుంది. మీరు కాలసర్పదోషం నుండి విముక్తి పొందాలనకుంటే ఈ రోజున నాగదేవత పూజ చేయండి. ఈ రోజున అవసరమైన దానం చేయడం వల్ల కూడా శుభఫలితాలు పొందుతారు.
పూజా విధానం
>> ముందుగా ఇంట్లోని పూజ గదిని గంగాజలంతో శుభ్రం చేయండి.
>> తర్వాత ఒక చెక్కపీటపై నాగదేవత విగ్రహం లేదా బొమ్మ లేదా ఫోటోను పెట్టండి.
>> అనంతరం నాగదేవత ముందు నెయ్యితో దీపం వెలిగించి పెట్టండి.
>> దీని తర్వాత ఈ రోజు ఉపవాసం పాటిస్తానని వాగ్దానం చేయండి.
>> నాగదేవత విగ్రహంపై పసుపు నీళ్లు చల్లి...తర్వాత గంధం, కుంకుమ, అక్షింతలు మరియు పువ్వులు, ధూపం మరియు నైవేద్యాలను సమర్పించండి.
>> తర్వాత కళ్ళు మూసుకుని భగవంతుని ధ్యానం చేయండి. పూజ చేయుటలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని అడగండి.
నాగపంచమి ప్రయోజనాలు
అనేక పౌరాణిక కథల్లో కూడా నాగ పంచమి ప్రస్తావన ఉంది. పురాణాల ప్రకారం, ఎవరైతే ఈ రోజున నాగదేవతను ఆరాధిస్తారో వారు రాహు మరియు కేతువుల వల్ల కలిగే అన్ని రకాల దోషాల నుండి విముక్తి పొందుతారు. జాతకంలో కాల సర్పదోషం ఉన్నవారు కూడా ఈ పూజ చేయడం వల్ల దోషం నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా పాముల భయం కూడా తొలగిపోతుంది.
Also Read: Mercury planet: జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే...భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook