Vastu Tips: ఇంటి ఖజానాలో ఈ వస్తువులుంచితే అంతులేని డబ్బులు, అదృష్టం మీ సొంతం
Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం డబ్బుు సంపాదించేందుకు చాలా మార్గాలున్నాయి. ఇంట్లో ధనవర్షం కోసం ఇంటి ఖజానాలో కొన్ని వస్తువులుంచడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయని..కుబేరుడి కటాక్షం లభిస్తుందని వాస్తు పండితులు చెబుతుంటారు.
జీవితంలో బాగా సంపాదించాలని..అన్ని రకాల సుఖ సంతోషాలు దక్కించుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఏ విధమైన భౌతిక సుఖానికి లోటుండకూడదని భావిస్తారు. దీనికోసం ఇంటి ఖజానాలో కొన్ని వస్తువుల్ని చేరిస్తే సాధ్యమే అంటున్నారు.
జీవితంలో రాణించాలంటే ఎక్కువ శ్రమించాలి. కొన్ని సందర్భాల్లో కష్టపడినా ఫలితముండదు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు లభించేందుకు, కుబేరుడి కటాక్షం కోసం కొన్ని ఉపాయాలు పాటించాలంటున్నారు వాస్తు నిపుణులు. ఇంట్లో వాస్తు దోషముంటే ఆ వ్యక్తి వృద్ధి, ధన వృద్ధిలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఈ నేపధ్యంలో ధనదేవత కుబేరుడిని ప్రసన్నం చేసుకునేందుకు వాస్తుశాస్తంలో ఇంటి ఖజానాలో కొన్ని వస్తువులుంచాలని ఉంది. ఈ వస్తువులు ఉంచడం వల్ల ఇంట్లో నెగెటివ్ శక్తి ప్రసరితమౌతుంది. వ్యక్తి జీవితంలో ధనలాభం ఉంటుంది.
ఇంటి ఖజానాలో ఈ వస్తువులతో కలిగే లాభాలు
ఖజానాలో కొత్త నోటు
ఇంటి ఖజానాలో కొన్ని వస్తువులుంచితే కచ్చితంగా అందులో డబ్బులు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ఇంటి ఖజానాలో కొత్త నోటు ఉంచితే..ధనదేవత కుబేరుడు ప్రసన్నుడౌతాడు. భక్తులపై అపారమైన ధనవర్షం కురిపిస్తాడు. అయితే ఇంటి ఖజానాలో కొత్త నోటు మాత్రమే ఉంచాలి. నలిగిన, చిరిగిన నోట్లు ఉంచకూడదు.
చిన్న అద్దం
ఇంటి ఖజానాలో డబ్బుులు పెరగాలంటే లాకర్ లేదా ఖజానాలో చిన్న అద్దం ఉంచడం మంచిది. దీనివల్ల డబ్బులు రెట్టింపు అవుతాయి. దాంతోపాటు మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.
కుబేర యంత్రం
జ్యోతిష్యశాస్రంలో కుబేరుడిని సమృద్ధికి ప్రతీకగా భావిస్తారు. ఈ క్రమంలో ఒకవేళ ఇంట్లో డబ్బులు రావాలని కోరుకుంటుంటే..ఇంటి ఖజానాలో ఒక కుబేర యంత్రం తప్పకుండా ఉంచాలి. ఖజానాలో ఉంచిన కుబేర యంత్రం డబ్బుల్ని ఆకర్షిస్తుంది. దీనికోసం ఖజానా తలుపుల బయట లేదా లోపల శ్రీయంత్రం అంటించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎక్కువ డబ్బులు లభిస్తాయి.
వెండి ముక్క
వాస్తుశాస్త్రంలో వెండి ముక్కకు విశేష ప్రాధాన్యత, మహత్యముంది. దీనికోసం బాక్స్ లోపల ఉత్తర గోడపై వెండి కాయిన్ లేదా కూర్చున్న భంగిమలోని లక్ష్మీదేవి బొమ్మ ఏర్పాటు చేయాలి. వాస్తుశాస్త్రం ప్రకారం కూర్చున్న భంగిమలోని లక్ష్మీదేవి స్థిరమైన ధనానికి ప్రతీక కాగా, నిలుచున్న భంగిమలోని లక్ష్మీదేవి ఫ్లోటింగ్ ధనానికి ప్రతీక.
ఎర్రటి వస్త్రం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఖజానాలో ఎర్రరంగు వస్త్రం పర్చడం శుభసూచకమౌతుంది. ఈ క్రమంలో ఖజానాలో ఎప్పుడూ ఎర్రటి లేదా బంగారు రంగు లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఈ క్రమంలో ఎర్రరంగు వస్త్రం ఖజానాలో ఉంచడం వల్ల డబ్బుల్ని ఆకర్షిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook