Vastu Tips For Lakshmi Devi Blessings: వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మి దేవీ నివాసం ఉండే చోట ఎవ్వరికీ, ఎలాంటి కష్టం ఉండదని చెబుతుంటారు. లక్ష్మీ దేవి కటాక్షం ఉంటే జీవితంల ఏ వెలితి లేకుండా సకల సౌకర్యాలు సమకూరుతాయని హిందూ ధర్మం చెబుతోంది. అంత పవర్ ఫుల్ అమ్మవారైన లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఇంట్లో ఉంచేటప్పుడు కొన్ని నియమాలు, పద్దతులు పాటించడం ఎంతో అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ మతం విశ్వాసాల ప్రకారం సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాల కోసం లక్ష్మీ దేవిని పూజిస్తారు. లక్ష్మీ దేవి కొలువై ఉన్న ఇంట్లో సిరి సంపదలకు, సకల భోగ భాగ్యాలకు కొదువు ఉండదనేది నమ్మకం. అందుకే లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం భక్తులు ఎన్నో పూజలు చేస్తారు.. అందులో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. 


వాస్తు నిపుణులు సూచిస్తున్న సలహాల ప్రకారం.. లక్ష్మి దేవి విగ్రహాన్ని ఇంట్లో సరైన స్థలంలో ప్రతిష్టించి పూజించడం ద్వారా భక్తులు ఆ తల్లి ఆశీర్వాదం పొందడంలో విజయం సాధిస్తారు. ఒకవేళ లక్ష్మి దేవీ విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. పూజా ఫలం దక్కకపోగా.. మరింత వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మి దేవి విగ్రహాన్ని ఈ దిశలో ఉంచవద్దు..
పూజ గదిలో లక్ష్మీ దేవి విగ్రహాన్ని దక్షిణం వైపున మర్చిపోయి కూడా ఉంచవద్దు. దక్షిణ దిశ పితృ దేవతలకు, యమునికి సంబంధించిన దిశగా చెబుతారు. ఒకవేళ దక్షిణం దిశలో లక్ష్మి దేవీ విగ్రహాన్ని లేదా ప్రతిమను ప్రతిష్టించారే అంటే.. ఇక వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.


అలాంటి లక్ష్మీ దేవీ విగ్రహాన్ని ఇంట్లో ఉంచవద్దు
నిలబడి ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. నిలబడిన లక్ష్మి దేవీ ఇంట్లో ఎక్కువ కాలం ఉండదని.. అలాంటి విగ్రహానికి పూజించిన వారికి పూజా ఫలం దక్కదని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.


లక్ష్మి దేవీ విగ్రహానికి సరైన దిశ ఏంటంటే..
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం లక్ష్మి దేవీ విగ్రహాన్ని సరైన దిశలో ఏర్పాటు చేసిన వారికి ధన, ధాన్యాలకు కొరత ఉండదు. లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి.


లక్ష్మి దేవీ గుడ్లగూబపై ఉండకూడదు
హిందూ ధర్మం ప్రకారం లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ అని తెలిసిందే. అయితే ఇంట్లో మాత్రం గుడ్లగూబపై కూర్చున్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే గుడ్లగూబపై కూర్చున్న లక్ష్మి దేవీ చంచల స్వభావం కలిగి ఉంటుందట. అందువల్ల లక్ష్మీ దేవి ఇంట్లో ఎక్కువ కాలం ఉండదనేది ఒక బలమైన విశ్వాసం.


అలాంటి విగ్రహాన్ని ఉంచవద్దు
వాస్తు శాస్త్రంలో పేర్కొన్న జాగ్రత్తల ప్రకారం ఇంట్లో పొరపాటున కూడా పగుళ్లు ఉన్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఉంచకండి. పగుళ్లుబారిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే వాస్తు దోషాలు తలెత్తి ఆ కుటుంబం ఇబ్బందుల పాలవుతుంది. అలాగే లక్ష్మీ దేవి విగ్రహాన్ని గోడకు ఆనుకుని ఉంచరాదు. అన్నింటికిమించి ఇంట్లో ఒకటి మించి ఎక్కువ లక్ష్మీ దేవీ విగ్రహాలను ప్రతిష్టించకూడదని వాస్తు శాస్త్రం ఘోషిస్తోంది.


(గమనిక : ఈ కథనంలో పేర్కొన్న వివరాలు సాధారణ నమ్మకాలు లేదా సమాచారంపై ఆధారపడి ఉంటాయి. ఇందులో ఉన్న అంశాలతో ZEE NEWS ఏ విధంగానూ ఏకీభవించడం లేదు)