Vastu Tips for Money: వెదురు మొక్కను ఈ దిశలో నాటితే.. మీ ఇంట డబ్బే డబ్బు..!
Vastu Tips: వెదురు మొక్కను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దీన్ని ఇంట్లో నాటడం వల్ల సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. ఇంట్లో వెదురు మొక్కను నాటడం వల్ల నెగటివ్ ఎనర్జీ నశిస్తుంది.
Vastu Tips for home: ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఏ పని సక్రమంగా జరగదు. అంతేకాకుండా మన కెరీర్ లో పురోగతి ఉండదు. వాస్తు శాస్త్రంలో (Vastu Shastra) ఇంటి దోషాలు లేదా ప్రతికూలతను తొలగించడానికి అనేక చిట్కాలు చెప్పబడ్డాయి. అందులో ఒకటి వెదురు మెుక్కను ఇంట్లో నాటడం. దీనిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. సాధారణంగా వెదురు మెుక్కను (Bamboo Plant) అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దీన్ని సరైన దిశలో నాటడం ద్వారా మాత్రమే మేలు జరుగుతుంది.
వెదురు ప్రయోజనాలు
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో వెదురు మొక్కను నాటడం వల్ల ప్రతికూల శక్తి నశిస్తుంది మరియు సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి వెదురులో కొలువు ఉంటుంది. ఇది ఇంట్లో నాటడం వల్ల అపారమైన డబ్బు వస్తుంది. పిల్లల మనస్సు చదువుపై లగ్నమవుతుంది. జీవితంలో సంతోషం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. అయితే వెదురు మొక్కను నాటేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి..
గాజు పాత్రలో వెదురు మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు. దీనిని సిరామిక్ కుండలో కూడా నాటవచ్చు. అయితే వెదురు మొక్కను కొనుగోలు చేసేటప్పుడు, దాని ఆకులు పసుపు రంగులో ఉన్నాయో లేదో చూసుకోండి. పసుపు ఆకులు ఉన్న మొక్కలను మాత్రమే ఇంటికి తీసుకురావాలి.
వెదురు మొక్కను ఏ దిశలో నాటాలి..
ఇంటి తూర్పు దిశలో వెదురు మొక్కను నాటడం వల్ల ధనంతోపాటు శుభం చేకూరుతుంది. అదేవిధంగా, దీనిని ఆగ్నేయ దిశలో నాటడం వల్ల సంపద వస్తుంది. జీవితంలో ఆనందం మరియు శాంతి కోసం దీనిని డైనింగ్ టేబుల్ మధ్యలో ఉంచాలి. అదే సమయంలో ఇంటి మెయిన్ డోర్ దగ్గర పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చదువులో, ఉద్యోగంలో విజయం సాధించాలంటే... వెదురు మొక్కను ఉత్తర దిశలో ఉంచాలి.
Also Read: కన్యారాశిలో లక్ష్మీ నారాయణ యోగం... అంతులేని సంపద ఈ రాశుల సొంతం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook