Vastu Plant Tips: హిందూధర్మంలో మొక్కలకు..చెట్లకు విశేష ప్రాధాన్యత ఉంది. హిందూమత విశ్వాసాల ప్రకారం కొన్ని మొక్కలు, చెట్లకు పూజలు జరుపుతారు. కొన్ని మొక్కల్ని ఇంట్లో నాటితే భగవంతుడి అనుగ్రహముంటుంది. ఏయే మొక్కల్ని నాటితే మంచి ఫలితాలుంటాయో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూధర్మం ప్రకారం కొన్ని మొక్కలు, చెట్లు దేవీ దేవతలకు ఆవాసం. అవే మొక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే ఇక ఆ ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లుతాయి. భక్తుల కష్టాలన్నీ దూరమౌతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం మొక్కలు ఇంట్లో ఉంటే పాజిటివ్ శక్తులు ప్రసరిస్తాయి. దాంతోపాటు ఇంట్లో సుఖం తాండవిస్తుంది. దేవతల ఆశీర్వాదం లభిస్తుంది.


హిందూమతంలో వాస్తుశాస్త్రానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఆ వాస్తుశాస్త్రం ప్రకారం పసుపు మొక్కలకు విశిష్టత చాలానే ఉంది. ఇంట్లో సరైన దిశలో అమర్చుకుంటే లక్ష్మీ నారాయణుల కటాక్షం లభిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి ప్రసన్నమై..భక్తుల కష్టాల్ని తొలగిస్తుంది. ఇంట్లో పసుపు మొక్క నాటితే చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా లక్ష్మీదేవి కటాక్షం ఆ ఇంటిపై ఉంటుంది. ఇంట్లో పసుపు వంటి మొక్కల్ని ఏ దిశలో నాటితే మంచిదనే విషయాన్ని కూడా వాస్తుశాస్త్రం వివరించింది. 


పసుపు మొక్కను సరైన దిశలో కాకుండా..తప్పుడు దిశలో నాటితే దుష్ప్రయోజనాలు కలుగుతాయి. ఇంటికి ఆగ్నేయదిశలో పసుపు మొక్కను నాటితే వాస్తుదోషం కూడా ఉండదు. మరోవైపు ఇంటి సమస్యల్నించి విముక్తి పొందేందుకు నార్త్ వెస్ట్ దిశలో నాటితే శుభసూచకమని అర్ధం. ఇంటి ఆవరణలో లేదా పెరట్లో నాటడం వల్ల నెగెటివ్ శక్తులు దూరమౌతాయి. కుటుంబసభ్యుల్లో పరస్పరం ప్రేమ చిగురిస్తుంది. విష్ణు భగవానుడికి పసుపు తిలకం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులుంటాయని నమ్మకం.అందుకే ఇంట్లో పసుపు మొక్క నాటితే ఇక విష్ణు భగవానుడి కటాక్షం మెండుగా ఉంటుంది. అటు బృహస్పతి గ్రహం కూడా బలోపేతమవుతుంది. 


Also read: Astrology Daan tips: దానధర్మాలు చేసేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook