Vastu Tips for Haldi Plant: ఇంటి లోపల లేదా వెలుపల మెుక్కలు నాటాలని గ్రంథాలలో పేర్కొనబడింది. అయితే ఇంటి లోపల కుండీలో పసుపు మొక్కను నాటవచ్చా? వాస్తు శాస్త్రం (Vastu Shastra) మరియు మత గ్రంథాలు దీని గురించి ఏమి చెబుతున్నాయి? అనే విషయాలు గురుంచి ఈ రోజు సవివరంగా తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 పసుపు మొక్క శుభప్రదం
జ్యోతిషశాస్త్రం ప్రకారం, పసుపు మొక్క (Haldi Plant) ఆరోగ్యం మరియు మతపరంగా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ఒక కుండీ తీసుకొని ఇంట్లో పసుపు మొక్కను నాటవచ్చు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇంట్లో పసుపు మొక్కను నాటడం ద్వారా, సానుకూల శక్తి ప్రవాహం ఉంటుంది, ఇది మీ మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది.


లక్ష్మీదేవి కటాక్షం 
ఇంట్లో పసుపు మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయండి. అంతేకాకుండా దానికి ఎరువులు కూడావేయండి. మెుక్క చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి. లక్ష్మీదేవికి పసుపు మెుక్క ఎంతో ప్రీతకరమైనదని నమ్మకం. ఈ మెుక్కను క్లీన్ గా ఉంచిన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని విశ్వాసం.  


కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ
వాస్తు శాస్త్రం ప్రకారం, పసుపు మొక్క యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే.. దానిని నాటిన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అనురాగం పెరుగుతుంది మరియు ప్రతికూల శక్తులు ఇంటిని వదిలి పారిపోతాయి. గురువారం విష్ణువుకు పసుపు తిలకం పూస్తే.. ఆయన తన భక్తులకు కోరుకున్న వరాన్ని ఇస్తాడు.


ఇంటి వాస్తు దోషానికి చెక్
పసుపు మొక్క మీ ఇంటి వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది. పసుపును అగ్ని కోణంలో ఉంచడం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇంట్లోని వ్యక్తుల మధ్య పరస్పర అనురాగాన్ని కొనసాగించడానికి, దానిని వాయువ్య దిశలో ఉంచాలి. పసుపు మొక్కను సరైన దిశలో ఉంచడం దాని ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మరియు కుటుంబంలో ఆనందాన్ని తెస్తుంది.


Also Read: International Yoga Day 2022: అంతర్జాతీయ యోగా డే జూన్ 21 నే ఎందుకు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.