Vastu Tips: మనం సుఖంగా సంతోషంగా హాయిగా బతికాలంటే కావాల్సిన ధనం చేతిలో ఉండాలి. ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు.. ధనమేరా అన్నటికీ మూలం అన్నట్టు మన సుఖ దుఃఖాలకు మిగతా విషయాల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం వలన ఆ ఇంటికి వాస్తు దోషం ఉండదు. ఒక వేళ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లైయితే.. ఆర్ధికంగా.. శారీరకంగా.. మానసికంగా కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రంలో డబ్బు నిల్వ కోసం.. ఆర్దిక పురోభివృద్ధికి కొన్ని పరిష్కారాలు చూపబడ్డాయి. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వలన ఆర్ధిక సమస్యల నుంచి బయటపడొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంట్లో క్విన్స్ (శ్రీ పండు)ను ఇంట్లో ఉంచడం వలన అనుకోని లాభాలు చూకూరతాయి. ఇందులో లక్ష్మీ దేవి ఉంటుందని ప్రతీతి. మరోవైపు ఇంట్లో పూజలో పెట్టిన కొబ్బరికాయను .. ఎర్రటి బట్టలో ఇంట్లోకానీ పెరటి గుమ్మంలో కానీ పెడితే.. దృష్టి దోషాలు పోతాయని పండితులు ఉవాచ. మరోవైపు ఇంట్లో కలబంద చెట్టును ఇంటి ముందు వేలాడదీస్తే సగం దృష్టి దోషాలు తొలిగిపోతాయని మన గ్రంథాలు పేర్కొంటున్నాయి.


మరోవైపు గోమతి చక్రాన్ని లేదా ఇంట్లో ఆవు ప్రతిమను ఇంట్లో ఉంచుకోవడం వలన సంతోషం, సుఖం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. 11 గోమతి చక్రాలను పసుపు బట్టలో  చుట్టి భద్రంగా ఉంచడం వలన లక్ష్మీ దేవి అనుగ్రహ ప్రాప్తి కలిగే అవకాశాలున్నాయి. మరోవైపు ఇంట్లో తాబేలు విగ్రహం ఉంటే అక్కడి ధనలక్ష్మీ తాండవం చేస్తుంది. తాబేలు.. దశావతారాల్లో రెండోది. అందుకే తాబేలు విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ ధనలక్ష్మీ ఉంటుందనేది ప్రతీతి. అందుకే ఏ ఇంట్లో తాబేలు విగ్రహం ఉంటుందో అక్కడ సంపదకు లోటు ఉండదు.


మరోవైపు ఇంట్లో ఉండే అలమారాను కూడా తూర్పు లేదా ఉత్తరం ముఖం వైపు ఉండేలా తలుపు ఉండాలి. ఉత్తరం కుబేరా స్థానం. అక్కడ ఎలాంటి వస్తువులు లేకుండా ఖాళీగా ఉంచితే అక్కడ ధనలక్ష్మీ వచ్చి తన నివాసం ఏర్పరుచుకుంటుందని మన గ్రంథాల్లో ఉంది. మరోవైపు తమలపాకు చెట్టు లక్ష్మీ స్వరూపం.  ఈ చెట్టు వల్ల ఇంట్లో ధనానికి లోటు ఉండదు.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


  Also Read: Pawan Chiranjeevi Meet: పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీర్వాదం.. రూ.5 కోట్ల విరాళంతో భరోసా ఇచ్చిన 'అన్నయ్య'



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook