Vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఏ దిశలో అమర్చుకోవాలి, ఆ దిశలో పెట్టుకుంటే సమస్యలు తప్పవా
Vastu Tips: మనీ ప్లాంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే ఎలా పడితే అలా పెట్టకూడదు. ఏ దిశలో పెట్టాలనే విషయంపై వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది.
Vastu Tips: మనీ ప్లాంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే ఎలా పడితే అలా పెట్టకూడదు. ఏ దిశలో పెట్టాలనే విషయంపై వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది.
చాలామంది ఇళ్లలో చూస్తుండే మనీ ప్లాంట్ మొక్కల విషయంలో వాస్తుశాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన సూచనలున్నాయి. మనీ ప్లాంట్ తీగలు భూమ్మీద పాకితే మంచిది కాదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఆ ఇంట్లో పాజిటివ్ ఎవర్జీ దూరమౌతుందట. అంతేకాదు ఇతర నష్టాలు కూడా ఉంటాయిట.
ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కల్ని ఏ దిశలో అమర్చుకోవాలి, ఏ దిశలో ఉంచకూడదనేది వాస్త్రుశాస్త్రం చెబుతోంది. వాస్తుశాస్త్రం ప్రకారం నార్త్ ఈస్ట్ దిశలో మనీ ప్లాంట్ మొక్కల్ని ఉంచకూడదట. అంతేకాదు ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ కూడా మంచిది కాదంటోంది వాస్తుశాస్త్రం. ఈ రెండు దిశల్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటే చాలా సమస్యలు ఎదురౌతాయి. అటు వైవాహిక జీవితం కూడా ఇబ్బందులకు గురి అవుతుంది.
అంతేకాకుండా మనీ ప్లాంట్ తీగలు భూమ్మీద పాకితే..ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ దూరమౌతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంకా చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ స్టిక్ లేదా గోడ సహాయంతో పైగి ఎదిగేలా ఉండాలి. అంతేకాకుండా మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోకుండా, తెల్లగా మారకుండా చూసుకోవాలి. ఇలా ఉంటే అశుభసూచకమని వాస్తుశాస్త్రం అంటోంది. అటువంటి ఆకులుంటే వెంటనే తొలగించేయాలట. నార్త్ ఈస్ట్, ఈస్ట్ వెస్ట్ కాకుండా మిగిలిన దిశల్లో మనీ ప్లాంట్ మొక్కల్ని అమర్చుకోవచ్చు.
Also read: Lunar Eclipse 2022: చంద్రగ్రహణం ఎప్పుడు.. ఏ సమయంలో.. ఏ రాశుల వారికి కలిసొస్తుంది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook