Vastu tips: ఆఫీస్ టేబుల్‌ను ఇలా సెట్ చేసుకుంటే ఇక విజయం మీ సొంతం...
Vastu tips: వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఆఫీస్ టేబుల్‌ను సరైన దిశలో, సరైన చోట ఏర్పాటు చేసుకుంటే... మీరు పూర్తి చేసే పనులకు మరింత సానుకూలత చేకూరుతుంది.
Vastu tips: భారతీయులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలనే విషయంలో అంతా వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకుంటారు. తద్వారా తమ కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి ప్రశాంతత, పురోగతి ఉంటుందని విశ్వసిస్తారు. కేవలం గృహ సంబంధ విషయాలే కాదు... ఆఫీస్‌లో ఏర్పాట్లకు సంబంధించి కూడా వాస్తు శాస్త్రంలో అద్భుతమైన టిప్స్ ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఆఫీస్ టేబుల్ ఎక్కడ ఉండాలి... దానిపై ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలనేది ఇప్పుడు తెలుసుకుందాం...
ఆఫీస్ టేబుల్‌ను ఇలా సెట్ చేసుకోండి :
- వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీస్ టేబుల్ గది తలుపు లేదా గది ద్వారానికి ఎదురుగా ఉండకూడదు.
- మీ వీపు భాగం గోడ వైపు ఉండేలా ఆఫీస్ టేబుల్‌ను ఉంచాలి.
- టేబుల్‌పై ఉండే క్రిస్టల్‌ను టేబుల్‌కు ఈశాన్యం వైపునే ఉండేలా చూసుకోండి.
- టీ కప్పు, కాఫీ కప్పు వంటివి టేబుల్‌కు ఉత్తరం దిశగా ఉండాలి.
- టేబుల్‌పై పుస్తకాలు, ఫైల్స్, డాక్యుమెంట్స్ మీ కుడి చేతి వైపు ఉండాలి.
- ఆఫీస్ టేబుల్ వెనుక వైపు గోడకు మంచి పోస్టర్ లేదా ఏదైనా చిత్రాన్ని ఉంచండి.
ఈ వాస్తు టిప్స్ (Vastu tips) పాటించడం ద్వారా మీరు పూర్తి చేయాల్సిన పనులకు మరింత సానుకూలత చేరుతుంది. ఆ గది పాజిటివ్ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. తద్వారా మీ మనసుకు ప్రశాంతతో పాటు, మీరు చేసే పనుల్లో పురోగతి కనిపిస్తుంది.
Also Read: Bank Holiday Alert: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్-డిసెంబర్ చివరి 10 రోజుల్లో ఆరు రోజులు సెలవులే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook