Bank Holiday Alert: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్... ప్రస్తుత డిసెంబర్ నెల చివరి 10 రోజుల్లో ఆరు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఇందులో 'నేషనల్ హాలీ డే' క్రిస్మస్ మాత్రమే. ఆ ఒక్కరోజు మాత్రమే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవు ఉంటుంది. పైగా ఆరోజు నాలుగో శనివారం కూడా కాబట్టి బ్యాంకులకు ఆరోజు సెలవన్న సంగతి తెలిసిందే. ఇక మిగతా సెలవులు కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు మాత్రమే వర్తిస్తాయి. ఆయా రాష్ట్రాల్లోని పండుగలు, వేడుకలను బట్టి అక్కడి బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.

సాధారణంగా బ్యాంకులకు ప్రతీ ఆదివారంతో పాటు రెండో, నాలుగో శనివారం సెలవు ఉంటుంది. ఆ లెక్కన ఈ నెల బ్యాంకులకు ఆరు సెలవులు వచ్చాయి. దానికి తోడు ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం మరో ఏడు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో వర్తించవు.
రెగ్యులర్ సెలవులతో పాటు ఫెస్టివల్ హాలి డేస్‌ని కలుపుకుంటే ఈ నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు. ఇందులో ఇప్పటికే ఆరు సెలవులు అయిపోయాయి. మిగతా ఆరు సెలవులు డిసెంబర్ 20-డిసెంబర్ 31 మధ్యలో రానున్నాయి.
ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. డిసెంబర్ 24 (Chrismas Eve), డిసెంబర్ 25 (Chrismas), డిసెంబర్ 26 (Sunday), డిసెంబర్ 27 (Chrismas Celebration), డిసెంబర్ 30 (U Kiang Nagbah), డిసెంబర్ 31 (New Years Eve)న బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
పైన పేర్కొన్న సెలవుల్లో కేవలం డిసెంబర్ 25 మాత్రమే దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కామన్ హాలీ డే. డిసెంబర్ 27, 31 సెలవులు కేవలం ఐజ్వాల్, డిసెంబర్ 30 సెలవు షిల్లాంగ్, డిసెంబర్ 24 సెలవులు ఐజ్వాల్, షిల్లాంగ్లకు మాత్రమే వర్తిస్తాయి. డిసెంబర్ 19 (Sunday), 25 (Chrismas), 26 (Sunday) తేదీల్లో అన్ని బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.