COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 Vat Purnima Timing 2023:హిందూ సంప్రదాయంలో పూర్ణిమలకు చాలా ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమను సంవత్సరంలో ఆరవ పౌర్ణమిగా భావిస్తారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి మే లేదా జూన్ నెలలో మాత్రమే వస్తుంది. ఈ పౌర్ణమిని వైశాఖ పూర్ణిమ అని అంటారు. ఈ పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా చాలా మంది ఈ రోజున నది స్నానాలు కూడా ఆచరిస్తారు. ఇలా ఆచరించి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మోక్షం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వైశాఖ పూర్ణిమ రోజున ఎలాంటి నియమాలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


జూన్ 3న జ్యేష్ఠ పూర్ణిమ ఉపవాసాలు పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి రోజున కొన్ని రాష్ట్రాల ప్రజలు చంద్రుడిని కూడా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్‌ జట్టులో ఉండాల్సిందే..!


శుభ సమయాలు:
జ్యేష్ఠ మాస పౌర్ణమి తిథి: జూన్ 4
జ్యేష్ఠ, శుక్ల పూర్ణిమ ప్రారంభ తేది: జూన్ 03 ఉదయం 11:16
జ్యేష్ఠ, శుక్ల పూర్ణిమ ముగింపు సమయం: జూన్ 04 ఉదయం 09:11 


పాటించాల్సిన పూజా నియమాలు:
వట్‌ పూర్ణిమ తిథి రోజున వ్రతాన్ని పాటించేవారు తప్పకుండా తెల్లవారుజామునే నిద్రలేవాల్సి ఉంటుంది. ఆ తర్వాత గంగా జలంతో స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత పూజా కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాత్ర పూట చంద్రునికి అర్ఘ్యం సమర్పించి.. పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 


Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్‌ జట్టులో ఉండాల్సిందే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి