Vat Savitri Vrat 2023: వటసావిత్రీ వ్రతం విశిష్టత, పూజా సమయాలు, శుభ ముహూర్తాలు!
Vat Savitri Vrat 2023 Puja Vidhi: వటసావిత్రీ వ్రతం రోజున స్త్రీలు ఇలా పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే సమయాల్లో ఈ పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vat Savitri Vrat 2023 Puja Vidhi: వటసావిత్రీ వ్రతం వివాహా స్త్రీలకు ఎంతో ప్రత్యేకమైనది.. ఈ వ్రతాన్ని ఉపవాసాలతో పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో కలిగే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని చేయడం వల్ల దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వటసావిత్రీ వ్రతం 19 మే శుక్రవారం వస్తోంది. అయితే ఈ రోజు స్త్రీలు ఉపవాసాలు పాటించి పూజా మర్రి చెట్టుకు పూజా కార్యక్రమాలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. వ్రతంలో భాగంగా స్త్రీలు ఏ సమయంలో పూజా కార్యక్రమాలు చేయాలో, పూజా నియమాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వటసావిత్రీ శుభ సమయం:
ఈ వ్రతాన్ని చేయాలనుకునేవారు మే 18 అమావాస్య తిథి రాత్రి 09:42 గంటల నుంచి మే 19 రాత్రి 09:22 గంటల మధ్య చేయోచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
వటసావిత్రీ ఉపవాసం, పూజా సమయాలు:
✬ చెర కాలం: ఉదయం 05:28 నుంచి 07:11 వరకు..
✬ లవ కాలం: 07:11 నుంచి 08:53 వరకు
✬ అమృత కాలం: ఉత్తమం: 08:53 నుంచి 10:35 వరకు..
✬ శుభ కాలం: 12:18 నుంచి 02:00 సాయంత్రం వరకు.
వటసావిత్రీ పూజా శుభ ముహూర్తాలు:
✽ బ్రహ్మ ముహూర్తం: ఉదయం 04:06నుంచి 04:47 వరకు..
✽ ఉదయం సాయంత్రం: ఉదయం 04:26 నుంచి 05:28 వరకు..
✽ అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు..
✽ విజయ్ ముహూర్తం: మధ్యహ్నం 02:34 నుంచి 03:29 వరకు..
✽ గోధూళికా ముహూర్తం: సాయంత్రం 07:06 నుంచి 07:26 వరకు..
వటసావిత్రీ పూజా విధానం:
వటసావిత్రీ వ్రతం చేసేవారు తప్పకుండా పూజ కోసం ఏడు రకాల ధాన్యాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెదురుతో తయారు చేసిన బుట్టను తీసుకోవాలి. అందులో సావిత్రి దేవి విగ్రహం పెట్టి మర్రి చెట్టు దగ్గర ఉంచి పూజా కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మర్రిచెట్టుకు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి.. శనగ, బెల్లం ప్రసాదంలా సమర్పించాలి. ఇలా పెళ్లైన స్త్రీలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నేరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి