Grah Gochar December 2022: డిసెంబరులో కొన్ని ప్రధాన గ్రహాల సంచారం ఉంది. సాధారణంగా ఒకే రాశిలో రెండు గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. వీరు వ్యాపారంలో లాభాలు గడించడంతోపాటు కెరీర్ లో విజయాన్ని కూడాసాధిస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం, డిసెంబరు 28న బుధుడు మకరరాశిలో సంచరించనున్నాడు. ఒక్క రోజు అనంతరం డిసెంబరు 29న శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకరరాశిలో ఈరెండు గ్రహాల కలయిక వల్ల ఈ 5 రాశులకు లాభం చేకూరనుంది. ఆ లక్కీ  రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి (Leo):  మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. 
కన్య (Virgo): కన్యా రాశి వారికి బుధ, శుక్రుల సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీరు వృత్తిలో పురోగతిని సాధిస్తారు. జాబ్ మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. .


తులారాశి (Libra): ఈ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనాలను పొందవచ్చు. వ్యాపారం విస్తరించవచ్చు. 
మకరరాశి (Capricorn): బుధుడు, శుక్రుడు ఈ రాశిలోనే సంచరించనున్నారు. దీంతో ఈ రాశివారికి వృత్తిలో పురోగతి, వ్యాపారంలో లాభం ఉంటుంది.  ఈ సమయంలో ఆరోగ్యం కూడా బాగుంటుంది. బిజినెస్ పెరుగతుంది ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
మీనరాశి (Pisces): బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో కలవడం వల్ల ఈ రాశి వారి కోరికలు నెరవేరుతాయి. వ్యాపారం మరియు ఉద్యోగంలో మీకు సమయం కలిసి వస్తుంది. మీరు అపారమైన ధనాన్ని పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.


Also Read: Budh Vakri 2022: ధనుస్సు రాశిలోకి తిరోగమన బుధుడు... ఈ 5 రాశులకు మంచి రోజులు మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U   


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook