Venus Effect: జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాలు మారినప్పుడు  వ్యక్తి జీవితంలో కూడా అనేక అంశాల పట్ల తీవ్రమైన  ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా జన్మజాతకంలో శుక్రుడు చేరినప్పుడు ఊహించని పరిణామాలు జరుగుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అయితే శుక్రుడు శుభ, అశుభ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడు నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహం. ఇది ప్రేమ, సౌందర్యం, సంపద, సృజనాత్మకత, ఆనందానికి చిహ్నం. శుక్రుడు శుభ స్థానంలో ఉన్నప్పుడు  అన్ని రంగాలలో ఉండే వ్యక్తలకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ గ్రహం జన్మ జాతకంలో ప్రవేశించినప్పుడు వ్యక్తిని ఆకర్షణీయంగా, మనోహరంగా, ప్రేమగల వ్యక్తిగా చేస్తుంది. శుక్రుడు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషకరమైన, సంతృప్తిరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. అదే గ్రహం అశుభ స్థానంలో వ్యక్తిగత సంబంధాలలో ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు,  ఆత్మవిశ్వాసం లేకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. జాతకంలో శుక్రుడి స్థితిని అంచనా వేయడానికి, జ్యోతిష్యులు దాని రాశి, ఇతర గ్రహాలతో సంబంధం, ఇంటి స్థానాన్ని పరిశీలిస్తారు. శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే, దాని ప్రభావాన్ని తగ్గించడానికి అనేక పరిహార చర్యలు చేయవచ్చు. 


శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కలిగే నష్టాలు: 


జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తాడని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చేతిలో డబ్బులు నిలవకపోవడం, అప్పుల పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు వైవాహిక జీవతంలోను ఎన్నో ఇబ్బందులు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రుడి ప్రభావంతో విభేదాలు, భార్యాభర్తలు విడిపోవడం వంటివి అధికంగా జరుగుతాయి. శుక్రుడి జీవితంలోనే కాకుండా ఆరోగ్యం పట్ల అనేక సమస్యలను కలిగిస్తాడు. ఈ గ్రహ ప్రభావం కారణంగా చర్మ వ్యాధులు, లైంగిక సంక్రమణ వ్యాధులు, కీళ్ల నొప్పులు, జీవితం పట్ల విరక్తి కలిగే భావనలు కలిగిస్తాడు. శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం దెబ్బతినడం, భయం, నిరాశ కలుగుతాయి.  


శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ పనులు చేయకూడదు:


వివాహం, పెళ్లి సంబంధిత కార్యక్రమాలు: శుక్రుడు ప్రేమ, వివాహానికి సంబంధించిన గ్రహం. శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తే దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష నిపుణులు నమ్ముతారు.


పుట్టింటి నుంచి బయలుదేరడం: శుక్రుడు సౌఖ్యం, సంపదకు సంబంధించిన గ్రహం. శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు పుట్టిన ఇంటి నుంచి బయలుదేరితే, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. 


కొత్త వ్యాపారం ప్రారంభించడం: శుక్రుడు లక్ష్మికి సంబంధించిన గ్రహం. శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభిస్తే, నష్టాలు రావచ్చని ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయని వేద నిపుణులు చెబుతున్నారు. 


కొత్త ఇంట్లోకి ప్రవేశించడం: శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే, ఆ ఇంట్లో అశాంతి ఉండవచ్చని, లేదా మరణం, భార్యా భార్తల మధ్య గొడవలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.


ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం: శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకుంటే, ఆ ఒప్పందాలు సరిగ్గా అమలు కాకపోవచ్చని పండితులు అంటున్నారు.


శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ పనులు చేయవచ్చు:


ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం:  శుక్రుడు ఆధ్యాత్మికతకు కూడా సంబంధించిన గ్రహం. శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే, మంచి ఫలితాలు పొందుతారని పండితులు సూచిస్తున్నారు. 


దానధర్మాలు చేయడం: శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు దానధర్మాల చేయడం వల్ల గ్రహ దోషం,  పాపాలు తొలగిపోతాయని జోతిష్యనిపుణులు చెబుతున్నారు.


అవసరమైన వారికి సహాయం చేయడం: శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేయడం వల్ల  శుభ ఫలితాలు పొందుతారని  పండితులు చెబుతున్నారు.


గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోండి. Zee Telugu News ధ్రువీకరించలేదు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి