Shukra Gochar 2022: డిసెంబర్లో శుక్రుడి గోచారం.. ఈ 3 రాశులకు అదృష్ట యోగం...
Shukra Gochar 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, డిసెంబర్లో శుక్ర గ్రహం ధనస్సు మరియు మకరరాశిలో సంచరించబోతోంది. శుక్రుడి రాశి మార్పు వల్ల 3 రాశుల వారు ప్రయోజనం పొందనున్నారు.
Shukra Planet Transit In December 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుండి మరొక రాశికి సంక్రమిస్తాయి. ఈ యోగం కొందరికి శుభంగా, మరికొందరికి అశుభంగా ఉంటుంది. డిసెంబరులో శుక్రుడు రెండుసార్లు తన రాశిని మార్చబోతున్నాడు. మెుదటగా డిసెంబరు 5న ధనస్సు రాశిలో, ఆ తర్వాత మకరరాశిలో సంచరించనున్నాడు. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. శుక్రుడి సంచారం వల్ల మూడు రాశులవారు అపారమైన లాభం మరియు కెరీర్‌లో పురోగతిని సాధించనున్నారు. శుక్రుడి గోచారం వల్ల ఏ రాశులు వారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
సింహం (Leo): శుక్ర గ్రహ సంచారం వల్ల మీ అదృష్టం ప్రకాశిస్తుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి ఐదవ ఇంటిలో సంచరించబోతోంది. పిల్లల లేని దంపతులు సంతానం పొందుతారు. ప్రేమలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.
వృశ్చికం (Scorpio): శుక్రుని రాశి మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి రెండవ ఇంటికి రాబోతోంది. దీంతో మీరు ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు. మీ ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో మీ పురోగతికి అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఖర్చులను నియంత్రణలో ఉంచుకుంటే మీకు మంచిది.
కుంభం (Aquarius): ధనుస్సు రాశిలో శుక్రుని సంచారం కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి 11వ ఇంట్లో జరగబోతోంది. దీంతో మీ ఆదాయంలో రెట్టింపు పెరుగదల ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీరు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
Also Read; Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రులు ప్రారంభం ఎప్పుడు? దీని విశిష్టత ఏంటో తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook