Venus Planet Transit In Kumbh: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు రాశిలో  చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మరో 24 గంటల్లో శుక్రుడు కుంభరాశిలో (Venus transit 2023) సంచరించనున్నాడు. ఇప్పటికే కుంభరాశిలో శనిదేవుడు, సూర్యుడు ఉన్నారు. పైగా కుంభరాశిని శనిదేవుడు పరిపాలిస్తాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, శుక్రుడు, శని మిత్రులు. అందుకే శనిదేవుడి రాశిలో శుక్ర సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభం (Aquarius)
శుక్రుని సంచారం కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి లగ్న గృహంలో సంచరిస్తుంది. దీంతో మీ ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. శుక్రుడు మీ రాశి యెుక్క ఏడో ఇంటిని చూస్తున్నాడు. దీంతో మీ వైవాహిక జీవితంలో సంబంధాలు బలంగా ఉంటాయి. పార్టనర్ షిప్ చేసే వ్యాపారంలో మీరు భారీగా లాభాలను గడిస్తారు. ఉద్యోగంలో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. 


వృషభ రాశి (Taurus)
శుక్రుని సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ సంచార జాతకంలో పదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీని వల్ల మీ పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారం విస్తరిస్తుంది. పాత పెట్టుబడుల ద్వారా మీకు లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. పైగా వృషభరాశికి అధిపతి శుక్రుడే కాబట్టి దీని సంచారం ఈ రాశివారికి మేలు చేస్తుంది. 


మిథునం రాశిచక్రం (gemini)
శుక్రుడు రాశిచక్రంలో మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి తొమ్మిదో ఇంట్లో ఉండబోతున్నాడు. దీంతో మీరు చేపట్టే ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు రాణిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారుల విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 


Also Read: Mauni Amavasya 2023: ఇవాళ ఈ 5 రాశుల అదృష్టం ప్రకాశించనుంది.. ఇందులో మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook