Venus transit 2023: మరో 5 రోజుల్లో కుంభంలోకి వెళ్లనున్న శుక్రుడు... ఈ రాశులవారు జాగ్రత్త..!
Venus transit 2023: లవ్, రొమాన్స్ మరియు విలాసాలకు కారుకుడైన శుక్రుడు కుంభంలోకి ఎంటర్ అవ్వనున్నాడు. కుంభరాశిలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశులవారికి ఇబ్బందులు తలెత్తుతాయి.
Venus transit 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడిగా భావిస్తారు. ముఖ్యంగా శుక్రుడిని అందం, ఆనందం, డబ్బు మరియు ప్రేమకు కారకుడిగా భావిస్తారు. అలాంటి శుక్రుడు జనవరి 22న కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు వల్ల అన్ని రాశిచక్రాలు ప్రభావితం అవుతాయి. శుక్రుడి సంచారం కొందరికి శుభఫలితాలను ఇస్తే.. మరికొందరికి ప్రతికూల రిజల్ట్స్ ను ఇస్తుంది. శుక్రుడి సంచార సమయంలో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటకం (Cancer): శుక్రుడి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ చేసే వారికి డబ్బు సమస్యల వచ్చే అవకాశం ఉంది. ఈ సమయలో నవగ్రహాలకు, హనుమాన్ కు పూజుల చేయడం వల్ల శుక్రుడి యెుక్క అ శుభప్రభావాలు కాస్తా తగ్గే అవకాశం ఉంది.
కన్యా రాశి (Virgo): కన్యా రాశి వారి ఆరో ఇంట్లో శుక్ర సంచారం జరగబోతుంది. ఈ సమయంలో ఆచితూచి మాట్లాడండి. ఇతరులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శత్రువుల నుంచి ముప్పు ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశం కూడా ఉంది.
వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశివారు మానసికంగా ఒత్తిడికి గురవుతార. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తుతాయి. లైఫ్ పార్టనర్ తో వాగ్వాదాలు పెట్టుకోకండి, అది మీ దాంపత్య జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రేమికులకు కూడా ఈ సమయం అంతగా కలిసిరాదు. వ్యాపార, ఉద్యోగుల్లో నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది
Also read: Basant Panchami Upay: విద్యార్థులు చదువులో రాణించాలంటే.. వసంత పంచమి నాడు ఇలా చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook