Venus Rise 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. హిందూమత విశ్వాసాల ప్రకారం ఏదైనా గ్రహం ఉదయించడం లేదా అస్తమించడం అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో శుక్రగ్రహం ఉదయించడం ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపించనుందో తెలుసుకుందాం..ముఖ్యంగా నాలుగు రాశులపై ప్రభావం గట్టిగానే ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆగస్టు 18న శుక్రుడు కర్కాటక రాశిలో ఉదయించాడు. ఏదైనా గ్రహం ఒక రాశిలో ఉదయించడమనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఊహించని లాభాలు వచ్చి పడతాయి. కొన్ని రాశుల అదృష్టం తిరిగిపోతుంది. దశ మారుతుంది. శుక్రగ్రహం కర్కాటక రాశిలో ఉదయించడం వల్ల కొన్ని రాశుల జీవితాల్లో ప్రేమ, ఆనందం ఉంటాయి. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులకు అద్భుత లాభం కలగనుంది. ముఖ్యంగా కుంభం, కన్యా, కర్కాటకం, మేష రాశులకు  దశ తిరిగిపోనుంది. ఊహించని లాభాలు కలగనున్నాయి. 


కుంభ రాశి జాతకులకు శుక్రుడి ఉదయించడం వల్ల అన్ని వైపుల్నించి లాభాలు కలగనున్నాయి. కుటుంబసభ్యులతో మంచి జీవితం గడుపుతారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తి కానున్నాయి. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత చాలా అవసరమంటున్నారు. ఇళ్లు లేదా వాహనం కొనాలనే కోరిక నెరవేరనుంది. ఊహించని విధంగా ధనలాభం కలగనుండటంతో ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులుండవు.


శుక్రుడు కర్కాటక రాశిలో ఆగస్టు 18న ఉదయించడం వల్ల మేష రాశి జాతకులకు గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టు చెప్పవచ్చు. దీర్ఘకాలంగా పెండింగులో పడి ఉన్న పనులు పూర్తి కానున్నాయి. ఈ రాశి జాతకులు చాలా రకాల సమస్యల్నించి విముక్తి పొందుతారు. ఆస్థి లేదా వాహన కొనుగోలు యోగం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. కెరీర్‌పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. 


జ్యోతిష్యం ప్రకారం కన్యా రాశి జాతకులకు ఈ సమయం చాలా అనుకూలమైంది. అత్యంత శుభప్రదమైందిగా భావిస్తారు. వైవాహిక జీవితంలో ఈ రాశి జాతకులు చాలా అనందంగా ఉంటారు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకోవడంతో ఆర్ధికంగా ఎలాంటి సమస్య ఎదురుకాదు. స్నేహితులతో పరిస్థితులు చాలా బాగుంటాయి. 


అన్నింటికంటే ముఖ్యం కర్కాటక రాశి జాతకం. ఎందుకంటే శుక్రుడు ఉదయించేది ఈ రాశిలోనే. అందుకే ఈ సమయంలో ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఇదే మంచి సమయం. మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇక పెళ్లి జీవితంలో కూడా చాలా బాగుంటుంది. ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.


Also read: Nagula Chavithi 2023: నాగుల చవితి రోజు చేయకూడని పనులు ఇవే.. ఈ పనులు చేస్తే జీవితాంతం బాధపడతారు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook