Venus Transit 2023: శుక్ర గ్రహం సంచారం కారణంగా ఈ రాశులవారి జీవితాల్లో మళ్లీ కీలక మార్పులు! జరబోయేది ఇదే..
Venus Transit 2023: శుక్రుని సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా కొంతమందిలో మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భౌతిక ఆనందం, వైవాహిక ఆనందం, కీర్తి, ప్రతిభ, శృంగారానికి సూచికగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం కొన్ని రాశులకి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటుంది. అన్ని గ్రహాల లాగా ఈ గ్రహం కూడా కొన్ని ప్రత్యేక సమయాల్లో రాశి సంచారం చేస్తుంది. నవంబర్ మూడో తేదీన శుక్ర గ్రహం రాశి సంచారం చేయబోతోంది. ఈ సంచారం కన్యా రాశిలో జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో అనేక రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ గ్రహం రాశి సంచారం చేయడం కారణంగా ఏయే రాశుల వారి వ్యక్తిగత పరిస్థితులు మారుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు:
మేష రాశి:
మేష రాశి వారు కుటుంబంలో భౌతిక ఆనందం, శాంతి పొందుతారు. దీంతోపాటు వీరు కొన్ని మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. భవన నిర్మాణాలకు, మరమ్మతులకు ఈ సమయంలో డబ్బులు ఖర్చు చేస్తారు. ఈ సమయంలో బాగోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఇక విద్యను అభ్యసిస్తున్న వారు ఈ సమయంలో కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేస్తున్నవారు గొప్ప అవకాశాలు పొందుతారు. అంతేకాకుండా స్నేహితుల మద్దతు లభించి..ఈ సమయంలో ఊహించని లాభాలు కూడా పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది. మీరు కొన్ని మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అదనపు ఖర్చుల కారణంగా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు శుక్రుడు సంచార క్రమంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కోపాన్ని తగ్గించుకుని శాంతితో ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ సమయంలో మీ తోటి స్నేహితుల మద్దతు లభించి అన్ని రకాలుగా వారు సమస్యలు పంచుకుంటారు. ఈ సమయంలో వీరికి ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మిథున రాశి:
మిధున రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అంతేకాకుండా కోపం పెరగడం కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో చర్చలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ సమయంలో మిథున రాశి వారికి జీవితం అస్తవ్యస్తమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మానసిక సమస్యలు పెరగడం కారణంగా ఆదాయం కూడా తగ్గిపోతుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసే వారికి ఎంతో లాభదాయకంగా కూడా ఉంటుంది. ఈ సమయంలో వీరికి చదువుపై ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇక ఈ సమయంలో పిల్లలు అయితే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరికి తల్లిదండ్రుల మద్దతు లభించి మంచి ఫలితాలు కూడా పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి