Venus Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత ఉన్నట్టే శుక్ర గ్రహానికి అంతకుమించి విశిష్టత ఉంటుంది. శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. అక్టోబర్ 2న శుక్రగ్రహం సింహ రాశిలో గోచారం వల్ల 4 రాశులపై విశేషమైన ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం శుక్ర గ్రహాన్ని ధన సంపదలు, విలాసం, భౌతిక సుఖాలకు ప్రతీకగా భావిస్తారు. అలాంటి ఈ శుక్ర గ్రహం త్వరలో అంటే అక్టోబర్ 2వ తేదీన సింహ రాశిలో ప్రవేశించనున్నాడు. శుక్రుడి సింహ రాశి ప్రవేశం కారణంగా కెరీర్, జీవితంలో కీలక మార్పులు రానున్నాయి. ఫలితంగా  ఈ రాశులకు మహర్దశ పడుతుందని చెప్పవచ్చు. జీవితంలో భౌతిక సుఖాలే కాకుండా ధన సంపదలు, విజయం ఇలా అన్నీ ఒకదానివెంట మరొకటి లభిస్తాయి. శుక్రుడు అక్టోబర్ 2వ తేదీ రాత్రి 1 గంట 2 నిమిషాలకు సింహ రాశిలో ప్రవేశిస్తాడు. అక్టోబర్ 17న పూర్వ ఫాల్గుణి, అక్టోబర్ 30న ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో ప్రవేశిస్తాడు. నవంబర్ 3 వరకూ సింహ రాశిలో ఉండి ఆ తరువాత కన్యా రాశిలో ప్రవేశిస్తాడు. అంటే నవంబర్ 3 వరకూ ఈ నాలుగు రాశులపై కనకవర్షమే.


వృశ్చిక రాశి జాతకులకు శుక్రుడి రాశి గోచాచరం ప్రభావంతో కెరీర్, బిజినెస్‌పరంగా అమితమైన లాభాలు కలగనున్నాయి. వ్యాపారులకు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఊహించని లాభాలు ఆర్జిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది కలగదు. 


ధనస్సు రాశి జాతకులపై  శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం నవంబర్ 3 వరకూ తిరుగులేకుండా ఉంటుంది. అదృష్టం తోడుగా ఉంటుంది. ఏ పనైనా చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. పనిచేసేచోట గౌరవం లభిస్తుంది. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఫలితంగా ఆర్ధిక సమస్యలుండవు. వ్యాపారులకు మంచి సమయం. కొత్త రంగాల్లో పెట్టుబడులు లాభించవచ్చు.


శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం కర్కాటక రాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఉద్యోగులకు చాలా అనుకూలమైన సమయం. ఆఫీసులో గౌరవం ఉంటుంది. పదోన్నతి ఉండవచ్చు. ఇక వ్యాపారులకు అమితమైన లాభాలు కలుగుతాయి. ఈ జాతకుల జీవితంలో ఊహించని వృద్ది ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులుండవు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 


తులా రాశి జాతకులకు శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం చాలా అదృష్టంగా ఉంటుంది. అదృష్ట రాశిగా చెప్పవచ్చు. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు లాభిస్తాయి. ఇంక్రిమెంట్లు ఉంటాయి. వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. 


Also read: Rahu Ketu Transit 2023: రాహు కేతువులతో మహర్దశ కూడానా, ఈ మూడు రాశులకు అక్టోబర్ 30 నుంచి తిరుగుండదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook