Rahu Ketu Transit 2023: రాహు కేతువులతో మహర్దశ కూడానా, ఈ మూడు రాశులకు అక్టోబర్ 30 నుంచి తిరుగుండదు

Rahu Ketu Transit 2023: హిందూ మతంలో జ్యోతిష్య శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. కొన్ని గ్రహాల్ని అపశకునానికి చిహ్నాలుగా పరిగణిస్తారు. ఈ క్రమంలో రాహు కేతువుల సంచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 26, 2023, 06:37 AM IST
Rahu Ketu Transit 2023: రాహు కేతువులతో మహర్దశ కూడానా, ఈ మూడు రాశులకు అక్టోబర్ 30 నుంచి తిరుగుండదు

Rahu Ketu Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం రాహు కేతువులను ఛాయా గ్రహాలుగా పిలుస్తారు. ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ వక్రమార్గంలోనే పయనిస్తుంటాయి. ఈ రెండు గ్రహాల్ని క్రూర గ్రహాలుగా , మాయా గ్రహాలుగా కూడా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు వచ్చే నెల రాశి మారనుండటం మూడు రాశులకు మహర్దశ కల్గించనుంది.

సాధారణంగా రాహు కేతువుల గోచారం చాలా రాశుల జీవితాలపై దుష్ప్రభావం కల్గిస్తుంటుంది. కానీ కొన్ని రాశులకు మాత్రం మహర్దశ పట్టించనుంది. వాస్తవానికి ఈ రెండు గ్రహాల క్రూర దృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తుల జీవితాలు నాశనమౌతాయంటారు. అదే సమయంలో కొందరి అదృష్టాన్ని తిరగరాస్తాయి కూడా. ప్రస్తుతం రాహువు, మేషరాశిలోనూ, కేతువు తులా రాశిలోనూ ఉన్నాయి. ఈ రెండు గ్రహాలు అక్టోబర్ 30వ తేదీన గోచారం చేయనున్నాయి. రాహువు మీన రాశిలో ప్రవేశించనుండగా, కేతువు కన్యా రాశిలో ప్రవేశిస్తాడు. ఫలితంగా 3 రాశులవారికి ఊహించని ధన లాభం, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. 

మీన రాశి జాతకులకు రాహు కేతువుల గోచారం ప్రభావంతో గురు చండాల దోషం నుంచి విముక్తులవుతారంటారు. అందుకే ఈ రాశివారికి అమితమైన లాభాలు కలుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగవచ్చు. ఆకశ్మిక ధనలాభముంటుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది కలగదు. కొత్త రంగాల్లో పెట్టుబడి లాభాల్నిస్తుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం.

మకర రాశి జాతకులకు రాశి పరివర్తనంతో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వికటించిన పనులు కూడా పూర్తవుతాయి. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో అమితమైన లాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఇంట్లో సంపద వచ్చి పడుతుంది. ఉద్యోగులకు చాలా అనువైన సమయం.

ఇక కుంభ రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూల సమయంగా భావిస్తారు. వ్యాపారస్థులకు మంచి లాభాలు కలుగుతాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు కలుగుతాయి. డబ్బులకు ఇబ్బంది ఉండదు. గతంలో ఎప్పుడో ఎక్కడో నిలిచిపోయిన డబ్బు లేదా రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారం పెంచుకునేందుకు మంచి సమయంగా భావించాలి. 

Also read: Trigrahi Yog: త్రిగ్రాహి యోగం కారణంగా 3 రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News