Venus Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక, గోచారం, రాశి పరివర్తనాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాలు రాశి మారిన ప్రతిసారీ వివిధ రాశులపై ప్రభావం పడుతుంటుంది. శుక్రుడి గోచారం ప్రభావంతో మరో 48 గంటల తరువాత ఈ జాతకుల జీవితం పూర్తిగా మారిపోనుంది. దశ తిరిగిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు మూడు పరిస్థితుల్లో లేదా అవస్థల్లో గోచారం చేస్తుంటాయి. గ్రహాలు ఈ దశల్లో గోచారం చేసినప్పుడు ఆ ప్రభావం మొత్తం 12 రాశులపై పడినా కొన్ని రాశులకు అత్యంత లాభాలు కలగజేయనుంది. గ్రహాలు సాధారణంగా కుమార, యౌవన, వృద్ధాప్య దశల్లో గోచారం చేస్తుంటాయి. ఇందులో యువ దశలో చాలా వేగంగా లాభాలు అందుతాయి. ధనం, వైభవం, కీర్తి ప్రతిష్టలను అందించే శుక్రుడు ఏప్రిల్ 17వ తేదీన యువ దశలో ప్రవేశించనున్నాడు ఇందులో 12 నుంచి 18 డిగ్రీలు భ్రమణం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో 4 రాశులపై విశేష ప్రభావం ఉంటుంది. అపారమైన ధన లాభం, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 


కర్కాటక రాశి


శుక్రగ్రహం యౌవన దశలో గోచారం వల్ల ఈ రాశి వారికి జాతకంలో ఊహించని లాభాలుంటాయి. శుక్రుడి గోచారం కుండలిలో 11వ పాదంలో ఉంటుంది. ఈ క్రమంలో ఆదాయంలో ఊహించని భారీ లాభముంటుంది. ఆదాయానికి కొత్త కొత్త మార్గాలు కన్పిస్తాయి. ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుంది. అన్ని భౌతిక సుఖాలు పొందుతారు. ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం చేసేవారికి చాలా అనువైన సమయం. ఆర్ధికంగా పటిష్ట స్థితిలో ఉంటారు.


మేష రాశి


జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు యౌవన దశలో గోచారం కారణంగా మేషరాశివారికి శుభసూచకం. ధనానికి మూలమైన పాదంలో గోచారం చేస్తున్నందున అపారమైన లాభాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. పాత రోగాల నుంచి ఉపసమనం పొందవచ్చు.పెళ్లికానివారికి పెళ్లియోగం సిద్ధిస్తుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. మొత్తానికి 48 గంటల వ్యవధిలో ఈ జాతకం వారి జీవితం దశ తిరిగిపోనుంది.


శుక్ర గ్రహం యౌవన దశలో గోచారం కారణంగా సింహ రాశి జాతకులకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. శుక్రుడు గోచారం కుండలిలో కర్మపాదంలో భ్రమణం చేయనుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతి లభించవచ్చు. శుక్రుడు స్వగృహంలో ఉన్నందున మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. ఎప్పట్నించో ఉన్న కోర్కెలు నెరవేరుతాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యపరంగా ఏ విధమైన ఇబ్బందులు బాధించవు.


Also read: Solar Eclipse 2023: సూర్య గ్రహణం రోజు ఏర్పడుతున్న యుతి, ఈ రాశులకు అన్నీ ఎదురుదెబ్బలే


వృషభ రాశి


శుక్ర గ్రహం యౌవన దశలో ప్రవేశిస్తున్నందున వృషభ రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు లగ్నపాదంలో భ్రమణం చేయనుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పడనున్న మాలవ్య రాజయోగం ప్రభావంతో ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది. ఈ రాశివారిపై కనకవర్షం కురుస్తుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెద్దగా ఉండవు. తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు ఆర్జిస్తాయి. ఈ సమయంలో లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయవచ్చు. కోర్టు వ్యవహారాల్లో మీకు విజయం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు.


Also read: Vaisakha Amavasya 2023: వైశాఖ అమావాస్య ఎప్పుడు, తిధి వేళలేంటి, మహాదోషాల విముక్తికి ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo