Vaisakha Amavasya 2023: వైశాఖ అమావాస్య ఏప్రిల్ 20న ఉంది. ఆ రోజున భక్తి శ్రద్ధలతో చేసే పూజలకు మంచి ప్రతిఫలం ఉంటుందనే విశ్వాసముంది. అందుకే వైశాఖ అమావాస్యంటే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వైశాఖ అమావాస్య తిధి ఎప్పుడుంది, పూజా పద్ధతులేంటనేది పరిశీలిద్దాం.
ప్రతి నెల కృష్ణపక్షం అంతిమ తిధి అమావాస్య అవుతుంటుంది. హిందూమతంలో దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. వైశాఖ అమావాస్య ఏప్రిల్ 20వ తేదీ గురువారం నాడు వస్తోంది. ఈ రోజున భక్తులు ఉదయమే స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి దానాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల 3 మహా దోషాల్నించి విముక్తి పొందుతారనేది ప్రతీతి. భక్తులను దోషాల్నించి బయటపడవేసే దోషాల గురించి జ్యోతిష్యశాస్త్రంలో వివరంగా ఇలా ఉంది. దీనివల్ల ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం పడుతుంది.
వైశాఖ అమావాస్య ఎప్పుడు
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వైశాఖ అమావాస్య తిధి ఏప్రిల్ 19 ఉదయం 11 గంల 23 నిమిషాలకు ప్రారంభమై..ఏప్రిల్ 20 ఉదయం 9 గంటల 41 నిమిషాల వరకూ ఉంటుంది. ఏప్రిల్ 20 ఉదయం సూర్యోదయం సమయమే వైశాఖ అమావాస్యగా నిర్వహిస్తారు.
వైశాఖ అమావాస్య రోజున ఆచరించాల్సిన ఉపాయాలు
జ్యోతిష్యం ప్రకారం వైశాఖ అమావాస్య రోజు దక్షిణ భారతదేశంలో శని జయంతి వేడుక జరుపుకుంటారు. ఈ రోజున శనిదేవుడి పుట్టినరోజు. ఈరోజు ఆచరించే కొన్ని ఉపాయాలు శని సాడే సతి, శని దోషాల నుంచి భక్తుల్ని విముక్తుల్ని చేస్తుంది. శని సాడేసతి, శని దోషం జీవితంలో చాలా సమస్యలకు కారణమౌతుంటుంది. ఈ నేపధ్యంలో శనిదేవుడిని విధి విధానాలతో పూజలు చేయడం వల్ల శని దేవుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజు శనీశ్వరాలయానికి వెళ్లి నల్ల నువ్వులు, ఆవాల నూనె, నలుపు లేదా నీలం వస్త్రాలు సమర్పించాలి. శని చాలీసా పఠించాలి
కుండలిలో రాహు కేతువులు సహా ఇతర 7 గ్రహాలతో ప్రత్యేక స్థితి నుంచి కాల సర్పదోషం ఏర్పరుస్తుంది. ఇది సహజంగానే మీ పనుల్లో ఆటంకం కల్గిస్తుంది. విజయం కష్టమౌతుంది. ఈ క్రమంలో వైశాఖ అమావాస్య రోజు కాలసర్పం దోషం ఉపాయాలు ఆచరించాలి.
మరోవైపు శాస్త్రాల్లో కుండలిలో పితృదోషాన్ని అతిపెద్ద దోషంగా భావిస్తారు. పితృదోషం వల్ల మొత్తం కుటుంబం ఇబ్బందులకు గురవుతుందంటారు. ఇంట్లో ఏ విధమైన అభివృద్ధి కన్పించదంటారు. ఆ వ్యక్తి వంశం కూడా ముందుకు సాగకుండా అక్కడితో నిలిచిపోతుందని భావన. అందుకే వైశాఖ అమావాస్య రోజున పూర్వీకులకు నీటితో తర్పణం వదిలి పిండదానం చేయాలి. పూర్వీకులను స్మరించుకుని దాన కార్యక్రమాలు చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయంటారు. ఫలితంగా పితృదోషం నుంచి విముక్తులౌతారు.
జ్యోతిష్యం ప్రకారం వైశాఖ అమావాస్య రోజున ఉదంయ 5 గంటల 51 నిమిషాలకు స్వార్ధ సిద్ధ యోగం ఏర్పడనుంది. ఈ యోగంలో చేసిన పనులు వ్యక్తిని విజయం వైపు నడిపిస్తుంది. దాంతోపాటు ఆ వ్యక్తికి దోషాల్నించి ముక్తి కల్పిస్తుంది. వైశాఖ అమావాస్య రోజున స్నానం తరువాత నాగ నాగిని పూజలు చేయాలి. ఆ తరువాత నీటిలో వదిలేయాలి. దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి. కాలసర్పదోషం నుంచి విముక్తి పొందేందుకు శివుడిని ఆరాధించాలి. శివుడిని ఆరాధించడజం వల్ల కాలసర్ప దోషం నుంచి విముక్తులౌతారు.
Also read: Solar Eclipse 2023: సూర్య గ్రహణం రోజు ఏర్పడుతున్న యుతి, ఈ రాశులకు అన్నీ ఎదురుదెబ్బలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook