Shukra Guru Yuti 2023: అందం, ఆనందం, సంపద మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడు శుక్రుడు. ఎవరి జాతకంలో శుక్రదేవుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు. మీనరాశిలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. గురుడు ఇప్పటికే మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల శుభకరమైన యాదృచ్ఛికం ఏర్పడబోతుంది. ఈ రాశుల సంయోగం వల్ల అరుదైన మాళవ్యరాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీనరాశి
మీనరాశిలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. దీంతో శుక్రసంచారం ఈరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడు మీనరాశి జాతకంలో లగ్నమైన ఇంట్లో సంచరిస్తాడు. అంతేకాకుండా అరుదైన మాలవ్యరాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా వీరికి లక్ కలిసి వస్తుంది. సమాజం మరియు ఆఫీసులో మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కోరికలు నెరవేరుతాయి. 


మిధునరాశి
మిథునరాశి వ్యక్తుల జాతకంలో పదో ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. దీంతో ఈరాశివారు అపారమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారస్తులు భారీగా లాభాలను గడిస్తారు.  ఉద్యోగులకు ఇంక్రిమంట్ లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


కన్య
శుక్ర సంచారం ద్వారా ఏర్పడిన మాళవ్య రాజయోగం కన్యారాశి నుండి ఏడవ ఇంట్లో ఉండబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రాజయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. భాగస్వామ్యంతో చేసే వ్యాపారాల్లో భారీగా లాభాలు ఉంటాయి. అదృష్టం మీకు అడుగడుగునా కలిసి వస్తుంది. మీరు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు. 


ధనుస్సు రాశి
ఫిబ్రవరి 15న ధనుస్సు రాశిలోని నాల్గవ ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. దీని వల్ల ఈ రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలు స్వీకరించడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఈసమయంలో వ్యాపారం ప్రారంభించడం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది.


Also Read: Budh gochar 2023: మరో 4 రోజుల్లో ఈ 5 రాశులపై ధనవర్షం, ఉద్యోగంలో పదోన్నతి, అంతులేని లాభాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook