Budhadithya Yoga: కుంభ రాశిలో అరుదైన యోగం.. ఈరాశుల జీవితం అద్భుతం..

Budhaditya Yoga: ఈ నెల చివరిలో కుంభరాశిలో అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఈ యోగం మూడు రాశులవారికి కలిసి రానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 06:44 PM IST
Budhadithya Yoga: కుంభ రాశిలో అరుదైన యోగం.. ఈరాశుల జీవితం అద్భుతం..

Budhaditya Yoga: ఫిబ్రవరి నెలలో గ్రహాల పరివర్తనంలో పెను మార్పు రానుంది. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తుంది. కొందరికి ఇది శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 27న బుధుడు కూడా కుంభరాశిలోకి సంచరించనున్నాడు. కుంభంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈయోగాన్ని ఆస్ట్రాలజీలో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారు భారీగా లాభపడనున్నారు. 

బుధాదిత్య యోగం ఈ రాశులకు శుభప్రదం
కుంభం (Aquarius): బుధాదిత్య యోగం కుంభరాశివారికి చాలా మేలు చేస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఆర్థికంగా బలపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు లాభపడతారు. 
వృషభం (Taurus): మీరు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మేషం (Aries): బుధాదిత్య యోగం వల్ల మేషరాశివారికి లక్ కలిసి వస్తుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. 

Also Read: Surya Gochar 2023: సూర్యభగవానుడు కుంభరాశి ప్రవేశం.. ఈ రాశివారికి ప్రభుత్వం ఉద్యోగం పక్కా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News