Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు శుభ్రత గ్రహంగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉన్నప్పుడు చాలామంది జీవితాలపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంచార క్రమంలో పలు మార్పులు సంభవించి.. కొన్ని రాశుల వారికి మంచి జరిగితే, మరికొన్ని రాశుల వారికి తీవ్ర నష్టాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈరోజు శుక్ర గ్రహం కుంభరాశిలోకి సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా పలు రాశుల వారి జీవితాల్లో మార్పులు సంభవించబోతున్నాయి. అంతేకాకుండా ఈ రాశి సంచారం వల్ల పలురాశుల వారు ఊహించని లాభాలు పొందబోతున్నారు. అయితే ఈ క్రమంలో ఏ ఏయే రాశుల వారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల వారిపై శుక్ర గ్రహ ప్రభావం:
మేషం:

ఈ క్రమంలో మేష రాశి వారు వ్యాపారాలు ప్రారంభించడం వల్ల చాలా రకాల లాభాలు పొందుతారు. అంతేకాకుండా శుక్ర గ్రహ ప్రభావం వల్ల వీరు ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండడమే కాకుండా.. కుటుంబీకులతో సరదాగా గడపగలుగుతారు. ఈ సమయంలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు కూడా పొందుతారు.


మిథునం:
మిథునం రాశి వారిపై సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా.. వీరిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు పొందడమే కాకుండా మంచి పేరు సంపాదించుకుంటారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వీరు ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు.


కర్కాటక రాశి:
వ్యాపారాల్లో కర్కాటక రాశి వారు కూడా ఊహించని స్థాయిలో లాభాలు పొందుతారు. ఈ క్రమంలో వీరు కష్టపడి పనులు చేస్తే.. ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం అత్యంత ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ క్రమంలో వీరికి ప్రమోషన్స్ కూడా లభించవచ్చు.


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి శుక్ర గ్రహ సంచారం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం లభిస్తుంది. ఈరోజు నుంచి వీరు ఎలాంటి పనులు చేసినా విజయాలు సాధిస్తారు. ఈ రాశి వారు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ వారంలో ఉపశమనం లభిస్తుంది. స్నేహితుల మద్దతు లభించి ఎలాంటి పనులైనా చేయగలుగుతారు.


Also Read:  Disha Patani Pics : చెక్కిన శిల్పంలా ఉంది!.. ఒంపుసొంపులు కనిపించేలా దిశా పటానీ అందాల ప్రదర్శన


Also Read: Deva Katta : ఆ స్క్రిప్ట్ నాదే.. బీర్ బాటిల్స్ నావి కాదు.. దేవా కట్టా పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి