Shukra Gochar August 2022: ప్రేమ, శృంగారం, సంపద, లగ్జరీ లైఫ్ కు కారకుడు శుక్రుడు. జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తి మంచి జీవితాన్ని గడుపుతాడు. అతడికి ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు. అంతేకాకుండా అతడి లవ్ లైఫ్ కూడా బాగుంటుంది. ఇన్నింటికి కారణమైన శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. మరో 5 రోజుల్లో అంటే 7 ఆగస్టు 2022న శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటకరాశిలోకి (Venus Transit in Cancer 2022) ప్రవేశించనున్నాడు. అక్కడే ఆగస్టు 31 వరకు ఉండనున్నాడు. శుక్రుడు సంచారం వల్ల ఐదు రాశులవారు లాభపడనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): శుక్రుని సంచారం వల్ల మేష రాశి వారికి అపారమైన డబ్బు వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. కొత్త జాబ్ రావచ్చు. నిరుద్యోగులు పరీక్ష,ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. 


వృషభం (Taurus) : కర్కాటకంలో శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కల నెరవేరుతుంది.  


మిథునరాశి (Gemini): శుక్రుని సంచారం మిథున రాశి వారికి మేలు చేస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. 


కన్య (Virgo): ఈ వారికి శుక్రుడు మార్పు అన్ని రంగాలలో విజయాన్ని ఇస్తుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. సీనియర్లు లేదా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల మద్దతు లభిస్తుంది. ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది. 


తుల (Libra): తుల రాశి వారికి వీనస్ ట్రాన్సిట్ చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. కొత్త జాబ్ వస్తుంది. ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి. 


Also Read: ఆగస్టు 2న నాగ పంచమి.. మీ రాశి ప్రకారం మంత్రాలతో నాగదేవతను ఇలా పూజించండి! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook