Shukra Gochar In Cancer 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. శుక్రుడు... ప్రేమ, శృంగారం, సంపదలకు అధిపతి. ఆగస్టు 7న శుక్రుడు తన రాశిని మార్చి.. కర్కాటకరాశిలోకి (Venus Transit In Cancer 2022) ప్రవేశించాడు. అక్కడే ఆగస్టు 31వరకు ఉండనున్నాడు. ఈ సమయంలో శుక్ర సంచారం కొన్ని రాశులవారికి కలిసిరానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య (Virgo)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి శుక్రుని సంచారం శుభప్రదం కానుంది. శుక్ర గ్రహం కన్యారాశిలోని 11వ ఇంట్లో సంచరించింది. ఈ సంచారం వల్ల కన్యా రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీడియా, సినిమా, బ్యాంకింగ్ లేదా ఫ్యాషన్ డిజైనింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో రాణిస్తారు. ఈ రాశి వారు పచ్చ, ఒపల్ ధరించడం వల్ల అదృష్టం బాగుంటుంది. 


తుల (Libra): శుక్ర సంచారం ఈ రాశి వారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది. ఈ రాశిలో శుక్ర గ్రహం పదో స్థానంలో సంచరించింది. ఈ స్థలం వ్యాపార మరియు ఉద్యోగ గృహంగా భావిస్తారు.  కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆఫీసులో సీనియర్ల మద్దతు ఉంటుంది. తుల రాశి వారు డైమండ్ లేదా జార్కిన్ రత్నాలను ధరించడం వల్ల లాభపడతారు.


సింహం (Leo): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఈ రాశిలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఇది సంపద మరియు ప్రసంగం యొక్క ప్రదేశంగా పరిగణించబడుతుంది. వీరికి అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. ఆగస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకుంటారు. లాయర్లు, మార్కెటింగ్ మరియు టీచర్లు మొదలైన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.  


Also read: Rakshabandhan 2022: భద్ర ఎవరు? ఈ ముహూర్తంలో ఎందుకు రాఖీ కట్టకూడదు? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook