Shukra Gochar August 2022: శుక్ర గ్రహం...ప్రేమ, డబ్బు, శృంగారానికి కారకుడు. శుక్రుడు రాశి మార్పు మెుత్తం 12 రాశులపై పెను ప్రభావం చూపుతుంది. మరో 10 రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం మిథునరాశిలో ఉన్న శుక్రుడు...ఆగస్ట్ 7, 2022న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్కడే వీనస్ 31 ఆగస్టు 2022 వరకు ఉంటుంది. దీని తర్వాత శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో శుక్రుడు సంచరారం 4 రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది. వారికి కెరీర్ లో పురోగతి, వ్యాపారంలో లాభం ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): శుక్ర సంచారం వల్ల మేష రాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశివారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అంతేకాకుండా భారీగా డబ్బు సంపాదిస్తారు.  కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఎగ్జామ్-ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న వారు విజయం సాధిస్తారు.


వృషభం (Taurus): వృషభ రాశి వారికి శుక్రుడు మారడం వల్ల ఉద్యోగంలో మార్పు వస్తుంది. మంచి జాబ్ పొందుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. 


మిథునం (Gemini): మిథున రాశి వారికి శుక్రుని సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం కలిసి వస్తుంది.  వైవాహిక జీవితం బాగుంటుంది. 


కన్య (Virgo): కన్య రాశి వారికి శుక్రుని మార్పు కలిసివస్తుంది. వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సీనియర్‌ వ్యక్తులతో సమావేశాలు లాభిస్తాయి. పదోన్నతి పొందే అవకాశాలున్నాయి. జీవితంలో సౌకర్యాలు మెరుగుపడతాయి.


Also Read: Hariyali Amavasya 2022: ఇవాళే హరియాళీ అమావాస్య.. ఈ రోజు ఈ 5 పనులు అస్సలు చేయకండి! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook