Shukra Gochar In Gemini 2022: ప్రతి గ్రహం తన స్థానాన్ని మార్చుకున్నప్పుడు, దాని ప్రభావం ప్రజల జీవితంపై కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ చెడు అయినా కావచ్చు లేదా మంచైనా కావచ్చు. ఈనెలలో 5 పెద్ద గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. జూలై 13న శుక్ర గ్రహం మిథునరాశిలో (Venus Transit in Gemini 2022) సంచరించనుంది. దీని ప్రభావం 3 రాశులవారికి అదృష్టాన్ని తెస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి (Leo): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు సింహ రాశిలో 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఇది ఆదాయం మరియు లాభం యొక్క ప్రదేశంగా భావిస్తారు. ఈ సమయంలో ఈ రాశివారికి భారీగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది వ్యాపారులకు మంచి లాభాలు తెచ్చుపెడుతుంది. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. వీరు ఒపల్ రత్నాన్ని ధరించడం వల్ల ప్రయోజనం పొందుతారు. 


కన్య (Virgo)- శుక్ర గ్రహం కన్య రాశి యొక్క పదవ ఇంట్లో సంచరిస్తోంది. ఇది పని స్థలం మరియు ఉద్యోగ స్థలంగా పరిగణించబడుతుంది. వీరికి కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయం వ్యాపారవేత్తలకు అనకూలంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే ఏ పనైనా ఫలిస్తుంది. ధనలాభం ఉంటుంది. 


వృషభం (Taurus)- శుక్రుడు వృషభ రాశి యెుక్క రెండవ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఇది డబ్బు మరియు వాక్కు స్థానం అంటారు. వీరికి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. పరిశోధనా రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి డబ్బు పొందుతారు. వ్యాపారంలో ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వైట్ జర్కాన్ లేదా ఒపల్ రత్నం ప్రయోజనకరంగా ఉంటుంది.


Also Read: Astro Tips: ఏయే వస్తువుల్ని మరొకర్నించి తీసుకోకూడదో తెలుసా, లేకుంటే ఏమౌతుంది 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook