Shukra Grah Gochar 2022: ఆనందం, ప్రేమ, శృంగారం, డబ్బు, లగ్జరీ లైప్ ను ఇచ్చే గ్రహం శుక్రుడు. ఇది సింహరాశిని విడిచిపెట్టి సెప్టెంబరు 24న కన్యారాశిలోకి ప్రవేశించబోతుంది. వృషభం, కన్యారాశికి శుక్రుడు అధిపతి. కన్యారాశిలో శుక్ర సంచారం (Venus Transit in Virgo 2022) వల్ల కొన్ని రాశులవారికి లాభం, మరికొందరికి నష్టం కలుగుతుంది. కన్యారాశిలో శుక్రుని ప్రవేశం ఏ రాశివారికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుని సంచారం ఈ రాశులకు ప్రయోజనం
వృషభం (Taurus): వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారిపై శుక్ర సంచార ప్రభావం గరిష్టంగా ఉంటుంది. కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పెళ్లికాని వారికి వివాహమయ్యే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 
మిథునరాశి (Gemini): మిథునరాశికి అధిపతి బుధుడు. ఇతడు శుక్రుడికి మిత్రుడు. కాబట్టి ఈ రాశివారికి శుక్ర సంచారం మేలు చేస్తుంది. వ్యాపారంలో లాభపడతారు. ఆస్తి ద్వారా లాభం ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 
కన్య (Virgo): శుక్రుని రాశి మార్పు కన్యారాశిలో మాత్రమే జరుగుతుంది, కాబట్టి ఈ రాశిచక్రం ఎక్కువగా ప్రభావితమవుతుంది. వీరు అపారమైన డబ్బు పొందుతారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. వ్యాపారానికి ఇదే మంచి సమయం. 
తుల (Libra): తులారాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ రాశివారికి శుక్ర సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. జీతం పెరగవచ్చు. దీంతో లైఫ్ లో సుఖం, ఆనందం పెరుగుతాయి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.


Also Read: Sarva Pitru Amavasya 2022: సర్వ పితృ అమావాస్య నాడు కన్యారాశిలో 4 గ్రహాల కలయిక... సెప్టెంబరు 25 నుంచి ఈ 3 రాశులవారిపై డబ్బు వర్షం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook