Venus transit 2023: నవంబరులో ఈ రాశుల వారు ధనవంతులు కానున్నారు.. ఇందులో మీ రాశి ఉందా?
Venus transit 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు నవంబరు మెుదటి వారంలో తన రాశిని మార్చబోతున్నాడు. శుక్రుడి సంచారం ఏయే రాశులవారికి శుభఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.
Shukra Gochar in November 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహాంగా పిలుస్తారు. ఇతడిని సంపద, లవ్, రొమాన్స్ మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా భావిస్తారు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు నవంబరు 03న సింహరాశిని వదిలి కన్యారాశికి వెళ్తాడు. దీపావళికి ముందు శుక్రుని రాశి మార్పు నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. అంతేకాకుండా ధనత్రయోదశికి ముందు మీరు పెద్ద మెుత్తంలో ధనాన్ని పొందుతారు. శుక్రుని సంచారం వల్ల ఏయే రాశులవారికి లాభపడనున్నారో తెలుసుకుందాం.
వృషభం
నవంబర్‌లో వృషభ రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితిలో ఎదుగుదల ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.
మేషరాశి
శుక్రుని రాశి మార్పు మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ లైఫ్ లో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు కోరుకున్న జాబ్ వస్తుంది. మీ కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే అనుకూల సమయం. మీకు పెద్ద మెుత్తంలో డబ్బు అందుతుంది.
మిధునరాశి
శుక్రుడి రాశి మార్పు మిథున రాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
తులారాశి
తుల రాశి వారికి శుక్రుని సంచారం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఊహించని లాభాలను పొందుతారు. మీకు పూర్వీకుల ఆస్తి దక్కుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది.
Also Read: GajKesari Yoga: చంద్రగ్రహణం సమయంలోనే గజకేసరి రాజయోగం..ఈ 3 రాశుల వారికి ఏం జరుగుతుందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.