Venus Transit in Libra: ఈరోజు(బుధవారం)శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు. దీపావళికి ముందు శుక్రుని రాశి సంచారం వల్ల పలు రాశులవారికి ఆర్థికపరమైన మార్పులు రావొచ్చు. ఈ మార్పుల కారణంగా కొన్ని రాశులవారికి ఈ సంచారం వల్ల మంచి జరిగితే మరికొన్ని రాశులవారికి దుష్ర్పభావాలు ఎదురయ్యే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. అయితే ఈ సంచారం వల్ల చాలా రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. రాశిపై శుక్రుడి ప్రభావం ఏమిటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశిపై శుక్ర సంచార ప్రభావం:
శుక్ర సంచారం కారణంగా మేష రాశి వారికి వృత్తి పరంగా మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో మేషరాశివారు వ్యాపారం రంగాల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా భారీ లాభాలు పొందుతారు. ఈ రాశి వారు  పెద్ద వ్యాపార ఒప్పందాన్ని చేసుకునే చాన్స్‌ ఉంది. కాబట్టి ఈ రాశి వారు వ్యాపారం చేసే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


వృషభ రాశిపై శుక్ర సంచార ప్రభావం:
ఈ సంచారం వల్ల వీరి జీవితాల్లో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో అధికంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. అయితే డబ్బు సంపాదించే క్రమంలో ఈ రాశి వారు ఖచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది. దీపావళి రోజున ఉద్యోగులు చేసేవారి జీతం పెరగే ఛాన్స్‌ ఉంది. ఈక్రమంలో వీరు ఖరీదైన బహుమతులు పొందవచ్చు. వీరు వాగ్వాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది.


కర్కాటకంపై శుక్ర సంచార ప్రభావం:
కర్కాటక రాశి ఈ సంచారం వల్ల శుభ ఫలితాలను పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరి అందమైన ఇంటి నిర్మాణ కోరికలు తీరే ఛాన్స్‌ ఉంది. ఈ దీపావళి శుభ సందర్భంగా కుటుంబం పరంగా కొత్త వాహానలు పొందుతారు. వ్యాపారంలో నిమగ్నమైన వారు భారీ లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఎంత కష్టపడి పని చేస్తే అంతమంచి ఫలితాలు పొందుతారు. శృంగార పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.


సింహరాశిపై శుక్ర సంచార ప్రభావం:
ఈ రాశి వారు ఈ శుక్రుని సంచారం వల్ల వృత్తి జీవితంలో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వీరు ఆఫీసుల్లో మంచి పేరు సంపాదించుకునే అవకాశాలున్నాయి. వీరు దేశంలో అన్ని రకాల కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే ఛాన్స్‌ ఉంది. ఇక ఆర్థిక పరంగా ఈ రాశివారికి ఎలాంటి డబ్బు కోరత ఉండదు. అయితే వీరు ఈ క్రమంలో ఓం శుక్రాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాల్సి ఉంటుంది.


Also Read : Nirupam Paritala - Premi Viswanath : కార్తీకదీపం సెట్లో వంటలక్క చేసే పనులివేనా?.. డెడికేషన్ అంటే డాక్టర్ బాబుదే


Also Read : Chinmayi Sripada Twin Babies : పిల్లలకి పాలు పడుతున్న చిన్మయి.. ఆనందంలో తేలిపోతోన్న సింగర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook