Shukra Gochar 2022: కన్యారాశిలో మరో మార్పు జరుగబోతుంది. బుధుడు, సూర్యుడు ఇప్పటికే కన్యారాశిలో ఉన్నారు. మరో నాలుగు రోజుల్లో అంటే సెప్టెంబరు 24న కన్యారాశిలోకి శుక్రుడు (Venus Transit in Virgo 2022) ప్రవేశించనున్నాడు. శుక్రుని ఈ రాశి మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus)- ఈ రాశికి అధిపతి శుక్రుడు. కావున శుక్రుని సంచారం ఈ రాశివారికి మేలు చేస్తుంది. మీ లవ్ లో ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. ఈ రాశివారు పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. భారీగా డబ్బు సంపాదిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 


కన్య (Virgo) - ఈ రాశిలోనే శుక్రుని సంచారం జరుగుతుంది కాబట్టి కన్యారాశివారిపై గరిష్ట ప్రభావం ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ లైప్ స్టైల్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. 


తుల (Libra)- ఈ రాశికి కూడా శుక్రుడే అధిపతి. శుక్రుని సంచారం వల్ల మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి పాస్‌పోర్ట్, వీసా తదితర సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.


మీనం (Pisces)- వ్యాపార పరంగా కలిసి వస్తుంది. భారీగా లాభాలు ఉంటాయి. వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  ఆచితూచి మాట్లాడటం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. 


Also Read: 59 ఏళ్ల తర్వాత ఒకే రాశిలో 3 శుభ గ్రహాలు.. నవరాత్రులలో ఈ 5 రాశులవారిపై డబ్బు వర్షం! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook