Shukra Gochar 2023: శనిదేవుడి రాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా లాభం..
Shukra Gochar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, శుక్ర గ్రహం తన స్నేహితుడి రాశిలో సంచరించబోతోంది. శుక్రుడి యెుక్క ఈ సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Venus Transit In Kumbh 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ ట్రాన్సిట్ కొందరికి సానుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు జనవరి 22న కుంభరాశిలో (Venus Transit In Aquarius 2023) సంచరించనున్నాడు. కుంభరాశికి శనిదేవుడు అధిపతి. శనిదేవుడు మరియు శుక్రుడు మిత్రులు. శనిదేవుడి యెుక్క రాశిలో శుక్రుడి సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మకర రాశిచక్రం (Capricorn): శుక్రుని సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి రెండో ఇంట్లో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీలో ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది.
వృషభ రాశి (Taurus): శుక్రుని సంచారం వృషభ రాశి వారికి వరమని చెప్పాలి. ఎందుకంటే శుక్రుడు మీ జాతకంలో 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈసమయంలో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. వివిధ మార్గాల ద్వారా మీకు డబ్బు సమకూరుతుంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు లాభం చేకూరుతుంది. బిజినెస్ లో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి.
మిథున రాశిచక్రం (Gemini): శుక్రుని రాశి మార్పు మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. మీరు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. ఈసమయంలో మీరు కెరీర్ కు సంబంధించిన శుభవార్తను వింటారు. మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు.
Also Read: Shani Dev: జనవరిలో ఈ 3 రాశులకు శనిదేవుడు నరకం చూపిస్తాడు.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.