Venus Transit : రేపు శుక్రుడు రాశి మారుతున్నాడు.. ఈ రాశులకు అంతా మంచే జరుతుంది!
Venus Transit on 30 december : జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శుక్రుడు.. సంపద, ఆనందం, ప్రేమ, వైవాహిక బంధాలపై ప్రభావం చూపుతాడు. శుక్రుడు ధనస్సు రాశిలోకి రావడం వల్ల 4 రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Venus Transit on 30 december These Zodiac Signs Will be the Most Affected, Check Details here : డిసెంబర్ 30న శుక్ర సంచారము ఉండనుంది. ధనుస్సు రాశిలో శుక్రుడు పరివర్తనం (Venus Transit) చెందుతాడు. జనవరి 27, 2022 వరకు శుక్రుడు అదే రాశిలో ఉండబోతున్నాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శుక్రుడు.. సంపద, ఆనందం, ప్రేమ, వైవాహిక బంధాలపై ప్రభావం చూపుతాడు. శుక్రుడు ధనస్సు రాశిలోకి రావడం వల్ల 4 రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
మేషరాశి (Aries)
మేష రాశి వారికి ఈ శుక్ర సంచారం కలిసి వస్తుంది. 2022, జనవరి నెల మొత్తం వీరికి అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి.
సింహ రాశి (Leo)
ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో మొదటి నెల అంతా శుభప్రదంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. శుక్రుడితో పాటు లక్ష్మిదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.
కన్య (Virgo)
శుక్రుని సంచారం కన్యారాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. డబ్బు ఎక్కువగా సంపాదించడానికి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారు కాస్త కష్టపడితే చాలు.. వారు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉండదు. విద్యార్థులకు చదువులో ప్రతిభ చాటుతారు.
Also Read : Shardul Thakur: నాగార్జున గారూ.. ఈ థర్డ్ అంపైర్ మాకొద్దు! ప్లీజ్ వెంటనే తీసేయండి సర్
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశికి శుక్రుడు ఒక వరం అని నిరూపించుకుంటాడు. రవాణా సమయంలో ధనలాభం ఉంటుంది. అంతే కాకుండా ఉద్యోగంలో కూడా శుభ ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది. వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
Also Read : Mercedes Maybach S650: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ప్రత్యేకతలేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి