Mercedes Maybach S650: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ప్రత్యేకతలేంటో తెలుసా?

Mercedes Maybach S650: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతకు రూ.12 కోట్లు మెర్సిడీస్- మేబాక్​ ఎస్‌-650 గార్డ్‌ కారును వినియోగిస్తున్నారు. బుల్లెట్ సహా ఇతర బాంబు దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. ఇంతకీ ఆ కారుకు సంబంధించిన ప్రత్యేకలేంటో తెలుసుకుందామా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 06:58 PM IST
Mercedes Maybach S650: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ప్రత్యేకతలేంటో తెలుసా?

Mercedes Maybach S650: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతకు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ సరికొత్త కారును తీసుకొంది. ‘మెర్సిడీస్‌-మైబాచ్ ఎస్‌-650 గార్డ్‌’ని కొనుగోలు చేసింది. ఈ కారు ఖరీదు రూ.12 కోట్లు పైమాటే.. ఇది విఆర్‌-10 స్థాయి భద్రతను కల్పిస్తుంది. బుల్లెట్ సహా అనేక బాంబుల దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది.  

ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పర్యటన సందర్భంగా ప్రధాని ఈ కారులోనే ప్రధాని మోదీ హైదరాబాద్‌ హౌస్‌కు చేరుకున్నారు. ఇటీవలే ప్రధాని మోదీ భద్రత కోసం అవసరాలను గుర్తించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్.. ఆయన వాహనాన్ని మార్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు ఎస్‌-650 గార్డ్‌ కార్లను కొనుగోలు చేసింది. ఒక దానిలో ప్రధాని ఉండగా.. మరోకారును డికాయ్‌(ప్రధాని ఉన్నట్లు తలపించే వాహనం)గా వినియోగిస్తారు.

మెర్సిడీస్‌-మైబాచ్ ఎస్‌-650 గార్డ్‌ కారులో ప్రత్యేక ఫీచర్లు ఇవే..

1) విలాసవంతమైన ఎస్‌-650 గార్డ్‌ కారు వినియోగదారులకు అత్యున్నత శ్రేణి రక్షణ కల్పించేలా మెర్సిడీస్‌ జాగ్రత్తలు తీసుకొంది. కారు బాడీ, విండోస్‌ ఏకే-47 తూటాలను తట్టుకొని నిలబడతాయి.

2) కారుకు ఈవీఆర్‌ (ఎక్సప్లోజీవ్‌ రెసిస్టెటంట్‌ వెహికల్‌ ) 2010 రేటింగ్‌ లభించింది. ఇది దాదాపు రెండు మీటర్ల దూరంలోపు జరిగే 15 కిలోల టీఎన్‌టీ పేలుడు శక్తిని నుంచి ప్రయాణికులకు కాపాడుతుంది. కారు విండోస్‌కు పాలీకార్బొనేట్‌ ప్రొటెక్షన్‌ ఇస్తుంది. కారు కింద జరిగే పేలుడు నుంచి తట్టుకొనేలా రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి.

3) ఇక విషవాయువులతో దాడి జరిగినా.. లోపల ఉన్న వీవీఐపీని రక్షించేలా కారు లోపలే ప్రత్యేకమైన ఆక్సిజన్‌ సరఫరా విభాగం ఉంది.

4) ఈ వాహనంలో అత్యంత శక్తివంతమైన 6.0 లీటర్‌ ట్విన్‌ టర్బో ఇంజిన్‌ అమర్చారు. ఇది 516 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 900 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను అందుకొంటుంది. 

5) భారీ ఇంజిన్‌ ఉన్నా.. కారు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకే పరిమితి చేశారు. 

6) ఈ కారుకు ప్రత్యేకమైన ఫ్లాట్‌ టైర్లను వినియోగించారు. పంక్చర్లు పడినా.. దెబ్బతిన్నా ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు అవకాశం ఉంది. 

అప్పట్లో నరేంద్రమోదీ వినియోగించిన కార్లు

ప్రధాని నరేంద్రమోదీ.. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మహీంద్రా స్కార్పియో వినియోగించేవారు. ఆ తర్వాత ప్రధాని అయ్యాక బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ హైసెక్యూరిటీ ఎడిషన్‌‌, రేంజిరోవర్‌ వోగ్‌, టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌లను వినియోగించారు.  

Also Read: Good News: పెట్రోల్ పై రూ. 25 తగ్గించిన రాష్ట్రం.. జనవరి 26 నుండి అమల్లోకి..

Also Read: Gang Rape: దారుణం... లిఫ్ట్ అడిగిన పాపానికి మహిళపై గ్యాంగ్ రేప్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News