Venus set 2023: ఆగస్టు 3న అస్తమించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు కష్టాలు షురూ..
Shukra Asta 2023: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. మరో వారం రోజుల్లో శుక్రుడు సింహరాశిలో అస్తమించబోతున్నాడు. శుక్రుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు అనేక సమస్యలను ఎదుర్కోననున్నారు.
Venus set in leo 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఆస్ట్రాలజీలో శుక్రుడిని ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడు శుభస్థానంలో వారికి దేనికీ లోటు ఉండదు. సాధారణంగా గ్రహాల అస్తమయం చెడు ఫలితాలనే ఇస్తుంది. ఆగస్టు 03న రాత్రి 07.37 గంటలకు శుక్రుడు సింహరాశిలో(Venus set in leo 2023) అస్తమించబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశులవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. శుక్రుడి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనే రాశులు ఏవో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
శుక్రుడు అస్తమయం ధనుస్సు రాశి వారిపై చెడు ప్రభావం చూపుతుంది. ఈసమయంలో మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈసమయం అస్సలు కలిసిరాదు.
తులారాశి
శుక్రుడి రాశి మార్పు తులరాశి వారికి అస్సలు కలిసి రాదు. ఈ అస్తమయ సమయంలో తులరాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆఫీసులో మీకు మీ సహోద్యోగులు, బాస్ కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతాయి. వ్యాపారులు భారీగా నష్టపోతారు. ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి.
మిధునరాశి
శుక్రుడు అస్తమయ సమయంలో మిథునరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వద్దు. మాటలను అదుపులో ఉంచుకోండి.
Also Read: Mangal Gochar 2023: కుజుడు సంచారంతో లగ్జరీ లైఫ్ అనుభవించే రాశులివే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook