Vijaya Ekadashi 2023 Date: హిందూ మతంలో ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి. ఇందులో ఒకటి కృష్ణపక్ష ఏకాదశి, మరొకటి శుక్లపక్ష ఏకాదశి. ఈరోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి నాడు విజయ ఏకాదశిని జరుపుకుంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16, గురువారం నాడు విజయ ఏకాదశిని జరుపుకుంటారు. ఈరోజున శ్రీహరిని పూజించి, ఉపవాసం ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈ ఏకాదశిని చేయడం వల్ల మరణానంతరం మోక్షం లభిస్తుంది. అంతేకాకుండా మీ యెుక్క ప్రతి కోరిక నెరవేరుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుభ సమయం
పంచాంగం ప్రకారం, ఏకాదశి తేదీ గురువారం, 16 ఫిబ్రవరి 2023 ఉదయం 05:32 నుండి ప్రారంభమై... 17 ఫిబ్రవరి 2023 శుక్రవారం తెల్లవారుజామున 2.49 వరకు ఉంటుంది. విజయ ఏకాదశి వ్రత పారణ సమయం ఫిబ్రవరి 17న ఉదయం 08:01 నుండి 09:13 వరకు ఉంటుంది. విజయ ఏకాదశి ఉపవాస సమయం ఫిబ్రవరి 18న ఉదయం 06:57 నుండి ఉదయం 09:12 వరకు ఉంటుంది. పారణ నాడు సూర్యోదయానికి ముందే ద్వాదశి ముగుస్తుంది.


ఈ మంత్రాలు పఠించండి..
>> విష్ణు పూజ చేసే సమయంలో ఓమ్ నారాయణాయ లక్ష్మీ  నమ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే  మీకు ఉద్యోగం లభిస్తుందట.
>> ఓమ్ సియా పతియే రామ్ రామాయ నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. 
>> ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమ మంత్రాన్ని పఠించడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.


Also Read: Surya Dev Puja: వృశ్చిక సంక్రాంతి రోజున ఇలా చేస్తే.. మీకు డబ్బు, కీర్తి పెరుగుతాయి.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి