Surya Dev Puja: సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. మరో 4 రోజుల్లో అంటే నవంబరు 16న సూర్యదేవుడు తులరాశిని విడిచిపెట్టి వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబరు 15 వరకు సూర్యభగవానుడు అదే రాశిలో ఉండనున్నాడు. దీనినే వృశ్చిక సంక్రాంతి (Vrishchik Sankranti 2022) అంటారు. సంక్రాంతి రోజున స్నానం, దానానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజున చేసిన దానం యెుక్క ఫలం చాలా రెట్లు ఉంటుంది.
శుభ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం, వృశ్చిక సంక్రాంతి 2022 నవంబర్ 16 బుధవారం. ఈ రోజున పవిత్ర కాలం మధ్యాహ్నం 12.06 నుండి సాయంత్రం 05.27 వరకు ఉంటుంది. వృశ్చిక సంక్రాంతి మహాపుణ్య కాలం సాయంత్రం 03:40 నుండి సాయంత్రం 05:27 వరకు ఉంటుంది.
సూర్యదేవుడి పూజా విధానం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వృశ్చిక సంక్రాంతి రోజున సూర్య భగవానుని పూజించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ రోజున సూర్యుడిని సరైన మార్గంలో ఆరాధించడం వల్ల మీ అదృష్టం సూర్యునిలా ప్రకాశిస్తుంది. అంతేకాకుండా వృత్తిలో పురోగతి సాధిస్తారు. సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని నింపి అందులో ఎర్రచందనం పోసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజు పసుపు, కుంకుమ, బియ్యం కలిపిన నీటిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా సూర్యభగవానుడు సంతోషిస్తాడు. అర్ఘ్యం తరువాత సూర్య భగవానుడికి హారతి ఇచ్చి... నెయ్యి దీపం వెలిగించండి.
సంక్రాంతి రోజున సూర్యభగవానుని పూజించేటప్పుడు పూజలో ఎరుపు రంగు పుష్పాలను వాడండి. సూర్య భగవానునికి బెల్లం పాయసం సమర్పించి ఓం దినకరాయై నమః లేదా ఇతర సిద్ధ మంత్రాలను జపించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజున సూర్యభగవానుని పూజించడం వల్ల సూర్యదోషం, పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
శ్రద్ధ మరియు తర్పణం యొక్క ప్రాముఖ్యత
వృశ్చిక సంక్రాంతి రోజున దానం, పుణ్యం, తర్పణం, శ్రాద్ధం వంటి వాటికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజున తీర్థయాత్రలకు వెళ్లి పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం చేసే సంప్రదాయం ఉంది. సంక్రాంతి రోజున పుణ్యస్నానం చేయని వ్యక్తి ఏడు జన్మల పాటు అనారోగ్యంతో, దరిద్రుడిగా ఉంటాడని నమ్ముతారు. అంతే కాదు బ్రాహ్మణులకు మరియు పేదలకు అన్నం, వస్త్రాలు మరియు ఆవును దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
Also Read: Buddhaditya Yoga: ధనుస్సు రాశిలో బుధాదిత్య యోగం...ఈ 5 రాశుల వారిని వరించనున్న అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి