Vijayadashami 2022: దసరా రోజు చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అన్ని పండగల్లా కాకుండా ఈ పండగకు ఎంతో ఎంతో గుర్తింపు ఉంది. అయితే ఈరోజు నీలం రంగులో ఉండే పాలపిట్టను చూస్తే.. భవిష్యత్తులో అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం శ్రీరాముడు లంకాపతి అయిన రావణాసురున్ని సంహరించేందుకు వెళ్లే క్రమంలో ఈ పాలపిట్టను చూడడం వల్ల లంకను జయించాడని శాస్త్రం చెబుతోంది. ఈ పక్షిని చూడడం వల్ల శత్రువులపై కూడా సులభంగా విజయం సాధిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 శ్రీరాముడు రావణాసురుని సంహరించడం వల్లే అధర్మానికి విజయంగా గుర్తింపు కోసం విజయదశమిని జరుపుకుంటారు. అయితే శ్రీరాముడు లంకా పట్టణం నుండి అయోధ్యకు చేరుకున్నందుకు అక్కడి ప్రజలు దీపావళి వేడుకలను జరుపుకుంటారని పురాణాల్లోని కథలు చెబుతున్నాయి. అందుకే దీపావళిని పురస్కరించుకొని చాలామంది ఆయుధ పూజలను నిర్వహిస్తారు. ఈ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం ఆ విజయ గుర్తింపేనని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.


పాలపిట్టను చూడడం వల్ల కలిగే ప్రయోజనాలు:
విజయదశమి రోజున పాలపిట్టను చూడడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు దూరమవుతాయి. దసరా రోజు ఈ పక్షిని చూడడం శాస్త్రంలో అదృష్టంగా భావిస్తారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలన్నిటిపై విజయం సాధిస్తారని పురాణ కథలు తెలుపుతున్నాయి.


ఈ పక్షిని చూసిన వెంటనే ఈ మంత్రాన్ని ఉపదేశం చేయండి:
జీవితంలో అపారమైన సంపదను పొందడానికి దసరా రోజున ఈ పాలపిట్టను చూసి మంత్రాన్ని ఉపదేశించాల్సి ఉంటుంది. ఈ మంత్రాన్ని ఉపదేశించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు కలగడమే కాకుండా.. అనారోగ్య సమస్యలు దరిదాపులకు కూడా రావని శాస్త్రాలు చెబుతున్నాయి. పాలపిట్టను చూసిన తర్వాత ఈ మంత్రాన్ని చదవండి.." కృత్వా నీరాజనం రాజా బలవృద్ధయం యత బలం. శోభనం ఖంజనం పశ్యేజ్జలగోష్ఠసనిఘౌ । నీలగ్రీవ శుభగ్రీవా సకల ఫలప్రదుడు. పృథ్వీయంవతీర్ణోసి ఖచరీత్ నమోస్తుతే ॥ "


Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..


Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook