Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..

Dussehra Pujan Vidhi 2022: దసరా భారతీయులందరికీ ఎంతో ప్రాముఖ్యమైన పండగ కాబట్టి.. భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో శ్రీరాముని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2022, 08:30 AM IST
  • దసరా రోజు ఆయుధ పూజలో ఇందులో పేర్కొన్న
  • మంత్రాలను తప్పకుండా చదవాలి..
  • ఇలా చదినివతే అన్నిట్లో విజయాలు సాధిస్తారు.
 Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..

Dussehra Pujan Vidhi 2022: దసరా పండగ హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ పండగ ప్రతి సంవత్సరం అశ్విని మాసంలోని శుక్లపక్షంలో పదో రోజున జరుపుకుంటారు. సత్యం పై గెలిచిన విజయాన్ని గాను ఈ పండగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన వచ్చింది. కాబట్టి ఈరోజు భారత్ లోని అమ్మవారి భక్తులంతా ఘనంగా విజయదశమి వేడుకలను జరుపుకుంటారు. అంతేకాకుండా దసరా పండుగను పురస్కరించుకొని శ్రీరామున్ని కూడా పూజిస్తారు. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా ఈ పండగను జరుపుకోవడం విశేషం. 

జ్యోతిష్య శాస్త్రం ఈ పండగకు ఎంతో ప్రాముఖ్యత ను కలిగిందని పేర్కొంది. ఈరోజు ఎలాంటి శుభకార్యాలు చేసిన మంచి ఫలితాలు చేకూరుతాయని.. అంతేకాకుండా అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారని శాస్త్రం తెలిపింది. ఈరోజు ఏదైనా పనిని ప్రారంభిస్తే శ్రీరాముని అనుగ్రహం లభించి మంచి ఫలితాలు పొందుతారు. 

అంతేకాకుండా ఈరోజు చాలామంది ఆయుధ పూజలను కూడా చేస్తారు. ఆయుధ పూజలను చేయడం వల్ల పనిలో ఎలాంటి ఆటంకం కలగదని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొంది. ఆయుధపూజ క్రమంలో తప్పకుండా పనిముట్లకు హారతిని ఇవ్వాల్సి ఉంటుంది.

విజయదశమి రోజున ఈ మంత్రాలను తప్పకుండా చదవాలి:
|| ఓం జటా జూట్ ||
|| స్మాయుక్తమర్దేందుకృత లక్షణం ! ||
|| లోచన్యాత్ర స్నాయుక్తం పద్మేందు సాధ్య షాణయం !! ||

|| సంక్షయం యాంతి కళ్యాణం చోపపద్యతే ! ||
|| నందతే చ కులం పుంసాం మహాత్మ్యం మమశృణ్వతామ్ !! ||
|| శాంతికర్మాణి సర్వత్ర తథా దు:స్వప్న దర్శనే ! ||

|| గ్రహపీడాసు చోద్రాసు మహాత్మ్యం శృణుయాన్మము!! ||
|| సర్వ బద్ద వినిర్ముక్తో ధనద్యాన శుతాన్వితః ! ||
|| మనుష్యో మాత్ప్రసాదేన్ భవిష్యతి న సంశయః !! ||

దసరా పూజా విధి:
దసరా పూజ విధానంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పూజలను మధ్యాహ్నం సమయంలో జరుపుకోవాలని శాస్త్రం చెబుతోంది. ఇక ఈ పూజ విషయానికొస్తే.. ఈశాన్యంలో 8 తామర రేకులతో చక్రంలా తయారు చేయండి. ఈ అష్టదలాల మధ్యలో దుర్గామాత లేదా శ్రీరాముని ప్రతిమను ఉంచి పైన పేర్కొన్న మంత్రాన్ని జపించండి కార్యక్రమం ముగిసిన తర్వాత హారతిని చూపించి నైవేద్యం సమర్పించండి. ఇలా దసరా రోజు చేయడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

Also Read: Allu Arjun - Ram Charan : రా రా.. రా పక్కన కూర్చోరా!.. వీడియో వైరల్

Also Read: Godfather Twitter Review : గాడ్ ఫాదర్ ట్విటర్ట్ రివ్యూ.. అదే పెద్ద మైనస్ అంటున్నారే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News