Virat - Anushka: ఏమైనా సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ మాములు వాళ్లకు అసలు ఉండదు. వాళ్లు ఏం చేసినా.. సంచనలమే. చేయకపోయినా.. సంచలనమే. తాజాగా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు చాలా కాలం తర్వాత ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో వీరి కుటుంబాల్లో ఆనందం వెల్లి వెరిసింది. ఇక వీళ్ల అబ్బాయికి 'అకాయ్' అని నామకరణం కూడా చేసేసారు. దీంతో ఈ పేరుకు అర్ధం తెలుసుకోవడానికి మాన్యుల నుంచి సామాన్యుల వరకు అందరు ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు. ఇక ఈ బుజ్జిబాబు పుట్టినరోజున అతని గ్రహ స్థితి ఎలా ఉందనే విషయాన్ని జ్యోతిష్కులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 15న చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్నడాని ప్రముఖ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అటు దేవ గురువు బృహస్పతి సంచారం కూడా మేషరాశిలో జరిగింది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గజ కేసరి అనే రాజ యోగం ఏర్పడింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కుమారుడు అకాయ్ జన్మించిన టైమ్‌లో సూర్యుడు, శని కలిసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. కుజుడు, బుధుడు, శుక్రుడు, మకరంలో సంచరిస్తున్నారు.


కేతువు కన్యారాశిలో మరియు రాహువు మీనరాశిలో సంచరిస్తున్నారు. మేషరాశిలో జన్మించిన అకాయ్.. దానికి అధిపతి అయిన కుజుడు దాని ఉచ్ఛ స్థానమైన మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదో అద్భుతమైన యోగం. దీని కారణంగా పిల్లల లైఫ్ ఎంతో సుసంపన్నంగా సాగిపోతూ ఉంటుంది. పుట్టిన సమయం చెప్పకపోవడం వల్ల పూర్తి జాతక ప్రభావాన్ని ఇపుడు అంచనా వేయలేమంటున్నారు జ్యోతిష్యులు. చంద్రరాశి ప్రకారం అకాయ్ జీవితం సుసంపన్నంగా సాగిపోతూ ఉంటుంది. మరియు సమర్ధమైన నాయకత్వాన్ని అందించే అవకాశం ఉంది.


న్యూమరాలజీ ప్రకారం..
న్యూమరాలజీ సంఖ్యా శాస్త్రం ప్రకారం 15వ తేది కాబట్టి..


1వ నెంబర్ సూర్యుడికి సంబంధించినది. సూర్యుడి వల్ల మంచి ఆకర్షణ.. నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి.


5వ నెంబర్ బుధుడికి సంబంధించనది.. ఈ నెంబర్ వల్ల బుద్ధి కుశలత, తెలివి తేటలు, మెరుగ్గా ఉంటాయి.


ఈ రెండు కూరినపుడు వచ్చే 6వ సంఖ్య వల్ల శుక్రుడికి సంబంధించిన అంశాల్లో ఏ లోటు ఉండదు. శుక్రుడి కారణంగా కళలు, క్రీడలు, వంటి రంగాల్లో చక్కగా రాణించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల్లా ఇతను కూడా క్రీడా, సిని రంగాల్లో ప్రవేశిస్తే రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


అకాయ్ పేరు అర్ధమేమిటంటే.. ?


అకాయ్ అంటే కాయము లేని వాడని అర్ధం. అంటే శరీరం లేనిదని అర్ధం. పుట్టనిది రూపం లేనిదని అర్ధం. ఇది టర్కిష్ పదం. చంద్రుడి వెన్నెల అని అర్ధం కూడా ఉంది. మరియు నిరాకారమైనది. భౌతిక రూపం లేని నిరాకరమైన శరీరం లేని, ఆకారం లేని అనంతమైన శక్తి రాశి అని నిఘంటువు అర్ధం.


Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన


Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook