Vishwakarma Jayanti 2024: విశ్వకర్మ జయంతిని ఎందుకు జరుపుకోవాలి?..జయంతి ప్రాముఖ్యత..
Vishwakarma Jayanti 2024: ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతిని భాద్రపద మాసంలో జరుపుకుంటారు. ఈ పండగ విశ్వబ్రహ్మణులకు ఎంతో ప్రత్యేమనైది. ఈ రోజు భక్తులంతా స్వామివారిని పూజించి ఉపవాసాలు పాటిస్తారు.
Vishwakarma Jayanti 2024: విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున విశ్వకర్మ భగవానుడిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త అని భక్తులు నమ్ముతారు. ఆయనే స్వర్గం, భూమి, పాతాళం, దేవతలు, మానవులు, జంతువులు, మొక్కలు మొదలైన అన్నింటినీ సృష్టించారని చెబుతారు. అందుకే దేవతలంతా సృష్టికర్తగా పిలుస్తారు.
విశ్వకర్మ భగవానుడి జననం గురించి అనేక కథలు ఉన్నాయి. పూరణాల్లో పేర్కొన్న కథల ప్రకారం.. ఆయన సాక్ష్యత్తు బ్రహ్మదేవుడి మనస్సు నుంచి పుట్టారని చెబుతారు. మరొక కథ ప్రకారం..ఈ విశ్వకర్మ దేవుడు స్వయంభూవుగా, అంటే ఎవరి నుంచి పుట్టకుండా స్వయంగా వేలిసారని చెబుతారు. విశ్వకర్మ భగవానుడు చాలా నైపుణ్యం కలిగిన శిల్పి. ఆయనే స్వర్గానికి నిలయమైన అమరావతిని, దేవతల కోసం వాహనాలను, ద్వారక నగరం, లంక, పాండవుల కోసం ఇంద్రప్రస్థం మొదలైన అనేక అద్భుతమైన నిర్మాణాలను నిర్మించారని శాస్త్రాల్లో పేర్కొన్నారు.
విశ్వకర్మ జయంతి రోజున, కార్మికులు, శిల్పులు, వడ్రంగులు, ఇంజనీర్లు మొదలైన వృత్తులలో ఉన్నవారు విశ్వకర్మ భగవానుడిని పూజిస్తారు. వారి పనిముట్లను శుభ్రం చేసి, పూలతో అలంకరిస్తారు. అంతేకాకుండా స్వామివారికి నైవేద్యాలు సమర్పించి ఉపవాసాలు కూడా పాటిస్తారు. అలాగే చాలా మంది ఈ రోజు కొత్త పరికరాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా భారత దేశ వ్యాప్తంగా విశ్వకర్మ జయంతిని అనేక ప్రాంతాలలో జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.
విశ్వకర్మ దేవుడు సృష్టికర్త అని నమ్ముతారు. ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు వాస్తు శిల్పి. మానవుల నివాసాలకు వాస్తు శాస్త్రాన్ని కూడా ఆయనే అందించారని పురాణాలు చెబుతున్నాయి. విశ్వకర్మ దేవుడు ఐదు ముఖాలతో పాటు పది చేతులు కలిగి ఉంటాడు. ఆయన శంఖం, చక్రం, గద, పద్మం, వజ్రం, ధనుస్సు, బాణం, అంకుశం, పాశం, శూలం వంటి ఆయుధాలను ధరిస్తాడు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
విశ్వకర్మ జయంతి కథ:
ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాలని నిర్ణయిస్తారు. అందుకోసం విశ్వకర్మ దేవుడిని సృష్టించాడు బ్రహ్మ.. విశ్వకర్మ దేవుడు బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు స్వర్గం, భూమి, పాతాళం, దేవతల నివాసాలు, అసురుల నగరాలు, మానవుల నివాసాలు అన్నీ నిర్మిస్తారు. అంతేకాకుండా దేవతలు, అసురులు కలిసి అమృతాన్ని పొందాలని క్షీరసాగరాన్ని చిలిపితారు. ఆ సమయంలో విశ్వకర్మ దేవుడు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి క్షీరసాగరాన్ని చిలిపించడంలో కీలక పాత్ర పోషిస్తాడు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter