Do not buy these things on Wednesday: హిందూమతంలో ప్రతిరోజూ ఓ దేవుడి/దేవతకి అంకితం చేయబడింది. ఈ క్రమంలోనే గణేశుడిని బుధవారం రోజున పూజిస్తారు. అలానే హిందూమతంలో గణేశుడికి ప్రత్యేక స్థానం కూడా ఉంది. ఏదైనా శుభ కార్యం చేసేటప్పుడు గణేశుడి పూజ అనంతరమే పని ప్రారంభిస్తారు. మనస్పూర్తిగా పూజిస్తే వినాయకుని అనుగ్రహం ఉంటుందని హిందూ గ్రంధాలలో చెప్పబడింది. వినాయకుడికి పూజ చేస్తే ఒక వ్యక్తి జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిషశాస్త్రం ప్రకారం... వాక్కు, జ్ఞానం, తెలివితేటలు, సంపద మరియు వ్యాపారానికి కారకంగా బుధ గ్రహం పరిగణించబడుతుంది. ఓ వ్యక్తి జాతకంలో శుభ గ్రహాలు శుభాన్ని ఇస్తాయి. ఈ క్రమంలోనే బుధ గ్రహాన్ని బలంగా ఉంచడానికి.. బుధవారం నాడు ఈ వస్తువులను అస్సలు కొనకూడదు. ఒకవేళ ఆ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల వ్యక్తి జాతకంలోను బుధుడు బలహీనంగా మారతాడు. అప్పుడు ఆ వ్యక్తి సమస్యల్లో చుక్కుకునే అవకాశం ఉంది. బుధవారం కొనకూడని వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం. 


# పచ్చి వెన్న, పప్పు, కొత్తిమీర, పాలకూర, ఆవాలు, బొప్పాయి, జామ మొదలైన వాటిని కొనుగోలు చేసి బుధవారం ఇంటికి తీసుకురావడం అశుభం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి వ్యతిరేకం. ఈ పరిస్థితిలో బుధవారం పై వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా బుధ గ్రహం బలహీనంగా మారుతుంది.


# బుధవారం నాడు జుట్టుకు సంబంధించిన ఏ వస్తువు కొనకూడదు. అలాగే కొత్త బూట్లు లేదా బట్టలు కొనడం మరియు వాటిని ధరించడం కూడా అశుభంగా పరిగణించబడుతుంది.


# బుధవారం నాడు ఇంట్లో ఖీర్, రబ్రీ లాంటి పాలతో చేసే వస్తువులను తయారు చేయకూడదు.


# వివాహిత పురుషులు బుధవారం నాడు అత్తమామల ఇంటికి వెళ్లడం మరియు సోదరీమణులు, కుమార్తెలను ఆహ్వానించడం శ్రేయస్కరం కాదు. 


Also Read: Free Petrol: బంపర్ ఆఫర్.. 20000 కంటే ఎక్కువ పెట్రోల్ పంపుల వద్ద ఉచిత పెట్రోల్!


Also Read: Shah Rukh Khan: అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితా.. భారత్‌ నుంచి 'ఒకే ఒక్కడు' కింగ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.