Shah Rukh Khan: అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితా.. భారత్‌ నుంచి 'ఒకే ఒక్కడు' కింగ్!

Shah Rukh Khan in list of Empire Magazine 50 greatest actors of all time. బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ ‘ఎంపైర్‌’ మ్యాగజైన్‌ ప్రకటించిన 50 మంది అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితాలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ స్థానం సంపాదించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 21, 2022, 09:50 AM IST
  • అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితా
  • భారత్‌ నుంచి 'ఒకే ఒక్కడు' కింగ్
  • బాంబు అయితే ఒక సారే ప్రాణం తీస్తుంది
Shah Rukh Khan: అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితా.. భారత్‌ నుంచి 'ఒకే ఒక్కడు' కింగ్!

Shah Rukh Khan only Indian actor to be a part of Empire Magazine 50 greatest actors of all time: 50 మంది అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితాను బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ ‘ఎంపైర్‌’ మ్యాగజైన్‌ తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి 'ఒకే ఒక్కడు' స్థానం సంపాదించారు. అతడే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్. ప్రముఖ హాలీవుడ్‌ నటులు డెంజల్‌ వాషింగ్టన్‌, ఆంథోని మార్లన్‌ బ్రాండో, టామ్‌ హ్యాంక్స్‌, మెరిల్ స్ట్రీప్, జాక్ నికల్సన్, కేట్ విన్స్‌లెట్ వంటి దిగ్గజాల సరసన 57 ఏళ్ల షారుక్‌ నిలిచారు. విషయం తెలిసిన షారూఖ్ ఖాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాలీవుడ్ కింగ్‌కు విషెష్ చెపుతున్నారు. 

నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న షారూక్ ఖాన్ సాధించిన విజయాలను, అతడికున్న అభిమానుల గురించి ప్రముఖ బ్రిటీష్ మ్యాగజైన్ ‘ఎంపైర్’ ప్రత్యేకంగా ప్రస్తావించింది. దేవ్‌దాస్‌, మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌, కుఛ్‌ కుఛ్‌ హోతా హై, స్వదేస్ తదితర చిత్రాల్లో షారూక్ నటన అద్భుతం అని ఎంపైర్ మ్యాగజైన్ పొగడ్తల వర్షం కురిపించింది. 2012లో విడుదల అయిన 'జబ్ తక్ హై జాన్' చిత్రంలోని డైలాగ్‌ను 'ఐకానిక్ లైన్'గా గుర్తించబడింది. 'జీవితం రోజూ మన ఊపిరిని కొద్దికొద్దిగా హరిస్తుంది. అదే బాంబు అయితే ఒక సారే ప్రాణం తీస్తుంది' అనే డైలాగ్‌ బాలీవుడ్ కింగ్‌ కెరీర్‌లోనే ఉత్తమమైనదని అభిప్రాయపడింది.

ఎంపైర్ మ్యాగజైన్ కథనాన్ని షారూక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. షారూఖ్ ఖాన్ చివరిసారిగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాలో అతిథి పాత్రలో నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'పఠాన్‌' సినిమాతో 2023 జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించారు. ఈ చిత్రంలోని బేషరమ్ రంగ్ పాట పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: కొత్త సంవత్సరంలో కుజ సంచారం.. ఈ 3 రాశుల వారికి వెరీ లక్కీ! కెరీర్‌లో అన్ని విజయాలే

Also Read: నేడు శుభయోగాల అరుదైన యాదృచ్చికం.. శివుని అనుగ్రహంతో ఈ 4 రాశుల వారిపై డబ్బు వర్షం కురుస్తుంది!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x