Weekly Lucky Zodiac Sign In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెల రెండో వారం జాతకాలు ప్రారంభం కాబోతున్నాయి.. ఈ వారం సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు కొన్ని రాశుల వారికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సెప్టెంబర్ రెండో వారంలో ఎంతో ప్రత్యేకత కలిగిన కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారంతో పాటు రాశి సంచారం చేయబోతున్నాయి. అలాగే కొన్ని గ్రహాలు తిరోగమనం కూడా చేయబోతున్నాయి. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన యోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ యోగాల కారణంగా సెప్టెంబర్ రెండవ వారం కొన్ని రాశులకు ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారెవరో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మేష రాశి:
సెప్టెంబర్ రెండవ వారం మేషరాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి విపరీతమైన ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది.  ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి.. అలాగే వీరు కొత్త ఆస్తులతో పాటు బంగ్లాలు కూడా కొనుగోలు చేయవచ్చు. వీరికి అదృష్ట పరంగా చూస్తే ఎంతో బాగుంటుంది కెరీర్ జీవితంలో కూడా గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 



మిధున రాశి: 
మిధున రాశి వారికి సెప్టెంబర్ రెండోవారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీరికి అనుకున్న పనులు జరగడమే కాకుండా గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బులు వసూల్లో అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో వస్తున్న సవాళ్లు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతే కాకుండా అన్ని సమస్యలకు ఈ సమయం చెక్ పెట్టబోతుందని వారు అంటున్నారు. అలాగే ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధిస్తారు. 


కర్కాటక రాశి: 
ఈ వారం కర్కాటక రాశి వారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అడుగడుగునా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. దీంతోపాటు అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు కొత్త శక్తిని పొందగలుగుతారు. అంతేకాకుండా సరైన మార్గంలో కూడా ముందుకు వెళ్తారు. ఇక కెరీర్ పరంగా చూస్తే వీరికి అంతా బాగానే జరుగుతుంది. ఈ సమయంలో అనుకున్న లాభాలతో పాటు సులభంగా పనులు జరిగిపోతాయి. అంతే కాకుండా స్నేహితుల సహకారం లభించి కోరికలు కూడా నెరవేరుతాయి.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


తులారాశి: 
సెప్టెంబర్ 2వ వారం తులా రాశి వారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడమే కాకుండా వ్యాపారాలు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా వీరు లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఊహించని అదృష్టాన్ని పొందుతారు. అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.