March Second Week Weekly Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి రెండవ వారం అనేక గ్రహాలు రాశి సంచారంతో పాటు సంయోగం చేయబోతున్నాయి దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్యుడు ఇదే సమయంలో మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు దీని కారణంగా కన్యా రాశి తో పాటు మరికొన్ని రాశుల వారికి ఈనెల ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఇతర గ్రహాలు కూడా వాటి రాశులను మార్చుకోబోతున్నాయి. దీనికి కారణంగా అన్ని రాశుల వారిపై సమానంగా ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 10 నుంచి 17 వరకు వార ఫలాలు:
మేషం (Aries):


ఈ వారం మేష రాశి వారికి చాలా బాగుంటుంది. మీరు మీ పనిలో మంచి పురోగతి సాధిస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా గడపగలుగుతారు. దీంతో పాటు మీ పాత స్నేహితులను కలుసుకొని వారితో మీ అనుబంధాన్ని పంచుకుంటారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


వృషభం (Taurus):


ఈ వారం వృషభ రాశి వారికి కొంచెం కష్టంగా ఉండవచ్చు. మీరు మీ పనిలో ఈ వారం కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయడం చాలా మంచిది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో కలిసిమెలిసి ఉండడం చాలా మంచిది. అలాగే కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


మిథునం (Gemini):


ఈ వారం మిథునం రాశి వారికి చాలా సంతోషంగా ఉంటుంది. మీరు మీ పనిలో మంచి అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. స్నేహితులతో మీరు మంచి సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి.


కర్కాటకం (Cancer):


ఈ వారం కర్కాటక రాశి వారు చాలా బిజీగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో కొంత పని భారం పెరుగుతుంది. కాబట్టి ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు చేస్తున్న పనిలో మంచి పేరు పొందడానికి తప్పకుండా కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేందుకు కేటాయించడం వల్ల మంచి ఫలితాలు పొందు.


సింహం (Leo):


ఈ వారం సింహ రాశి వారికి చాలా శక్తివంతంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన మంచి పేరు సంపాదిస్తారు. అలాగే వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతోపాటు మీకు కుటుంబ సపోర్టు లభించి మంచి లాభాలు పొందుతారు.


కన్య (Virgo):


ఈ వారం కన్య రాశి వారికి చాలా శాంతియుతంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించడమే కాకుండా పురోగతి పొందుతారు అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు అలాగే మీ పాత స్నేహితులను కలుసుకొని ఎంతో ఆనందంగా ఉంటారు. 


తుల (Libra):


ఈ వారం తుల రాశి చాలా సృజనాత్మకంగా ఉంటారు. మీరు మీ పనిలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. దీని కారణంగా మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు.



వృశ్చికం (Scorpio):


ఈ వారం వృశ్చిక రాశి చాలా రొమాంటిక్ గా ఉంటుంది. మీరు మీ ప్రియురాలితో మంచి సమయాన్ని గడుపుతారు. దీని కారణంగా ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది అంతేకాకుండా శృంగారమైన జీవితాన్ని గడిపేందుకు కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మీకు మీ కుటుంబ సభ్యుల మద్దతు లభించి అనేక రకాల లాభాలు పొందుతారు. 


ధనస్సు (Sagittarius):


ఈ వారం ధనస్సు రాశి చాలా అదృష్టం పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన లాభాలు పొందుతారు. దీంతోపాటు మీ స్నేహితుల నుంచి కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది.



మకర (Capricorn):


ఈ వారం మకర రాశి వారికి కొంత నిరాశ కలిగించే అవకాశాలున్నాయి. నిజంగా ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ సమయంలో కొంత కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడి పనిచేయడం వల్ల ఎలాంటి విజయాలైన మీరు సాధిస్తారు.  అంతేకాకుండా పనుల్లో చిన్న చిన్న సవాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో వీరు కష్టపడి పనిచేయడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



కుంభం (Aquarius):


ఈ వారం కుంభ రాశి వారికి చాలా స్నేహశీలి గా ఉంటుంది.  దీంతో వీరు ఈ వారం మొత్తం స్నేహితులతో ఎంతో ఆనందంగా గడుపుతారు. అంతేకాకుండా వారి నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వీరికి స్నేహితుల నుంచి మంచి సపోర్టు లభించి పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.



మీన (Pisces):


ఈ వారం మీన రాశి చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు మనసునిండా ఆధ్యాత్మిక భక్తి చింతనతో ఉంటారు. దీని కారణంగా వీరికి ఆ దేవదేవతల అనుగ్రహం లభించి అనేక రకాల లాభాలు పొందుతారు. అలాగే స్నేహితుల నుంచి సపోర్టు లభించి, ఆర్థికంగా కూడా మెరుగుపడతారు. అంతేకాకుండా మనశ్శాంతి కూడా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి